‘ఉపాధి’కి ఊతం | Government raised the wage rate of Rs 20 | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ఊతం

Published Thu, Jul 24 2014 4:01 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM

‘ఉపాధి’కి ఊతం - Sakshi

‘ఉపాధి’కి ఊతం

కూలీ రేటు రూ.20 పెంచిన సర్కారు
రోజుకు రూ.169కు పెంచుతూ ఉత్తర్వులు
జాబ్‌కార్డుల ప్రకారం
4.45 లక్షల మంది కూలీలు
వంద రోజుల పనిపై దృష్టి పెట్టని సర్కారు
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మరో 20 రూపాయల కూలీ పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇం తకు ముందు ఉపాధి కూలీలకు రోజుకు రూ.149 చెల్లించేవారు. దానిని రూ.169 కు పెంచారు. ఉపాధిహామీ కింద చేపట్టే పనుల రేట్లను కూడ మార్చనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ రికార్డుల ప్రకారం 4,45,117 మంది కూలీలు జాబ్ కార్డులు పొందారు. వీరందరికీ కొత్త కూలీ రేట్లు వర్తించనున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలకు తప్పనిసరిగా వంద రోజుల పని దక్కేలా చూడాలన్న డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది.

 2013-14 లో రూ.14,578 కుటుంబాలకే 100 రోజుల పని
 ఉపాధిహామీ పథకం అమలులో రాష్ట్ర స్థాయి లో జిల్లా ఐదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం లో 14,578 కుటుంబాలకే వంద 100 రోజుల పని దొరకడం గమనార్హం. ఉపాధి హామీతో భరోసా పొందని అనేక మంది కూలీలు వలసబాట పట్టారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి బతుకుదెరువు కోసం కూలీలు వలసలు సాగించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ ఏడాది జాబ్‌కార్డులు పొందిన 4,45,117మంది కూలీలకు ఉపాధి కల్పించేం దుకు రూ.557.62 కోట్ల విలువ గల పనులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 203.50 కోట్లు ఖర్చు చేసి, 50,149 పనులు చేసినట్లు ప్రకటించారు. అందరికీ వంద రోజు ల పని కల్పించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

 2014-15లో లక్ష్యం నెరవేరేలా
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 4,45,117 మందికి జాబ్ కార్డులు జారీ చేసిన అధికారు లు, 2014-15లోనూ 2,19,236 కుటుంబాల కు వంద రోజులు పని కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశామని చెబుతున్నారు. ఈసారైనా వీ రందరికీ పని దక్కేలా చూడాల్సి ఉంది. ఉపాధిహామీ పథకం కింద ఈ యేడు ప్రణాళికలో చేర్చిన నిధులు వచ్చే ఏడాదిలో ఖర్చు చేసే అవకాశం ఉన్నా, ఈ ఏడాదిలో కూలీలకు ఉపాధికి గండి పడుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పలువురు సూచిస్తు న్నా రు. కూలీ పెంపు, వ్యవసాయాన్ని ఉపాధిహా మీకి అనుసంధానం చేయడం కూడా కలి సొచ్చే అవకాశమని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement