ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి | Governments should work for the people | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి

Published Sun, Mar 8 2015 1:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

గ్రామాల్లో నా ణ్యమైన విద్య అంది విద్యాభివృద్ధి జరగాలంటే ప్రతీ మండలకేంద్రంలో రెసిడెన్షియల్ విధానంతో పాఠశాలలు, కళాశాలుండాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు.

టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
 కొడంగల్ /బొంరాస్‌పేట: గ్రామాల్లో నా ణ్యమైన విద్య అంది విద్యాభివృద్ధి జరగాలంటే ప్రతీ మండలకేంద్రంలో రెసిడెన్షియల్ విధానంతో పాఠశాలలు, కళాశాలుండాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని, తెలంగాణ ప్రాంతంలోని నిరుపేదవర్గాల వారికి అండగాఉంటూ విద్య, వ్యవసాయం, ఉ ద్యోగం, ఉపాధి తదితర అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శ నివారం బొంరాస్‌పేట మండలం తుం కిమెట్లలో టీవీవీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో ఆ యన పాల్గొన్నారు. అనంతరం కొడంగ ల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం లో పాల్గొన్నారు.
 
  ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రామాల్లో కులాలు, మతాలను ఏకం చేస్తూ గ్రామాభివృద్ధి కమిటీలుగా ఏర్పడాలన్నారు. చెరువులు, కుంటల అభివృద్ధితోనే వ్యవసాయం, కులవృత్తులతోపాటు అందరికీ ‘నీరుంటేనే నూరుపనుల’కు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఆ వుల చిన్నయ్య అమరులయ్యారని గుర్తుచేశారు. కొడంగల్ డిగ్రీ కళాశాల విషయ మై విద్యాశాఖ మంత్రి మాట్లాడతానని చెప్పారు.
 
   విద్యార్థులు మహనీయుల ఆ శయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో టీవీవీ జి ల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, గోపాల్, అనిల్‌కుమార్, రా జేశ్వర్‌రెడ్డి, కుర్మయ్య, చిన్న బాల్‌రాజ్‌గౌ డ్, తోలు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మోతీబాయి, సర్పంచ్‌లు లక్ష్మి, ర్యాకం అరుణ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి దే శ్‌ముఖ్, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ మనోహర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రవీంద ర్, అధ్యాపకబృందం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement