హన్మాపూర్‌లో కిచిడీ పెడుతున్న ఆయా
సాక్షి, పెద్దేముల్: మధ్యాహ్న భోజన పథకంలో శ్రావణ మాసం అంటూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఇదేమని అడగితే గుడ్డు బదులు పండు ఇస్తున్నామంటున్నారు. తీరా ఏది ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది మధ్యాహ్న భోజన బిల్లులు రానిది గుడ్డు ఎలా పెట్టాలని ఆయాలు చెబుతున్నట్లు తెలస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారం తప్పకుండా విద్యార్థులకు గుడ్డు ఇవ్వాలి. పలు పాఠశాలల్లో వారంలో రెండు సార్లు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో హెచ్‌ఎంలు ఒక్క గుడ్డుకు రూ.4 బిల్లు చేస్తుంటారు. దానికి తోడు పాఠశాలల్లో మెనూ కూడా సరిగా పాటించడం లేదు. వారంలో రెండు సార్లు కిచిడీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్య లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్‌ను వివరణ కోరగ శ్రావణ మాసంలో గుడ్డు బదులు తప్పకుండా పండు ఇవ్వాలన్నారు, పండ్లు ఇవ్వక పొతే బిల్లు చేసే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు తెలియచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment