సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వంద శాతం నిధులను విడుదల చేశా మని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. రబీలో 3,313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుంచి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని శాఖ కొనుగోలు చేసిందని, దీని కోసం రూ.5,601.97 కోట్లు విడుదల చేశామన్నారు. వినియోగదారుల ఫిర్యా దుల కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ హ్యాండిల్‌ను గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు.
ఇప్పటికే వినియోగదారుల ఫిర్యాదు కొరకు సమాచార సలహా, సహాయ కేంద్రం (రిడ్రెసల్ సెంటర్) టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నా యి. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నెం: 1800 425 00333 , ఫేస్‌బుక్ ConsumerInformation RedressalCentre, , ట్విట్టర్ Telangana Consumer Info and Redressal Center, వెబ్‌సైట్. www.consumeradvice.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సబర్వాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment