రూరల్:ఆందోళన చేపడుతున్న కార్మికులు
నారాయణపేట రూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఐదో రోజుకు చేరింది. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కోషాధికారి నరసింహా, వెంకటయ్య, కృష్ణయ్య, బాల్‌రెడ్డి, మోహన్‌లాల్, అశోక్, రాజు, అంజయ్య, దస్తప్ప, నర్సింహులు పాల్గొన్నారు.
ధన్వాడ: తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం కొనసాగించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. వీరికి స్థానిక వైస్‌ఎంపీపీ రాంచంద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు మాకం సురెందర్, ఎంపీటీసీ మల్లయ్య, గోవర్దన్‌గౌడ్, టీఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ వారికి సంగీబావం తెలిపారు. నర్సింహులు, శంకర్, బాల్‌రాజు, భసంత్ టీఎంఆర్‌పీఎస్ నాయకులు బాల్‌రాజు, శంకర్, రాజు. కారోబార్ కృష్ణయ్య, బాలక్రిష్ణ, కృష్ణహరి, నూరోద్దిన్, తిప్పయ్య, తిరుపతమ్మ, బాల్‌నర్సిములు, ఇసుఫ్, చంద్రయ్య, వేంకటయ్య, పెంటమ్మ, లక్ష్మిమ్మ, సునిత, బాలయ్య, జయమ్మ పాల్గొన్నారు
మరికల్: గ్రామ పంచాతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్‌ఓల సంఘం డివిజన్ అధ్యక్షుడు గోవర్దన్‌చారీ వారికి మద్దతు పలికి మాట్లాడారు. నాయకులు పంచాయతీ సిబ్బందికి మద్దతు పలికారు. రాజేశ్వర్‌రెడ్డి, రాములు, వెంకటప్ప, చంద్రరెడ్డి, బాలప్ప పాల్గొన్నారు.
కోయిల్‌కొండ: పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఐఎఫ్‌టీయూ మండల అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడారు. చెన్నయ్య, వాసు, వెంకటయ్య, చంద్రశేఖర్, లక్ష్మయ్య, రాందాసు, గోపాల్, మాదవులు, నారాయణ, కనకమ్మ, ఖాదరయ్య, నాగమ్మ, బుచ్చమ్మ, అంజిలమ్మ, హన్మప్ప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment