కరీంనగర్ సిటీ :రాష్ట్రంలో నూతన వ్యవస్థకు గ్రామజ్యోతి కార్యక్రమం పునాది అని రాష్ట్ర ఆర్థిక, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఉదయం గ్రామజ్యో తి నోడల్ అధికారులకు, మధ్యాహ్నం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు అవగాహన స దస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై న ఈటల మాట్లాడుతూ జన్మభూమి, ప్రజాపథం, రచ్చబండ తదితర పేర్లతో గత ప్రభుత్వాలు హడావుడి చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. గ్రామసభలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, కాని ఇప్పటివరకు జరిగిన గ్రామసభలు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాయని అన్నారు. గ్రామసభల్లో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న పాపానపోవడం లేదన్నారు.
అధికారికి దగ్గరైతే, అధికార పార్టీ కార్యకర్త అయితేనో, ఎమ్మెల్యే చెబితే నో పనులు జరుగుతున్నాయనే భావన ఉందన్నారు. అలాకాకుండా గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. పా త వ్యవస్థ పోయి కొత్త విధానానికి గ్రామజ్యోతి అంకురార్పణ కావాలన్నారు. గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తే కలెక్టరేట్ వరకు ప్రజలు రారన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ధర్మం, నీతిని పాటించాలని హితవు పలికారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 15న గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయూన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు పునర్జీవం పోసేదే గ్రామజ్యోతి కార్యక్రమమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ బంగారు తెలంగాణ కోసం గ్రామజ్యోతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిపివేయడంతో జిల్లా పరిషత్‌లకు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. నిధుల కోసం సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వర్షాలు పడినందున గ్రామజ్యోతిలో హరితహారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, ఏజేసీ నాగేంద్ర, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, డీపీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొత్త వ్యవస్థకు గ్రామజ్యోతి పునాది
Published Fri, Aug 14 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement