Rajinder itala
-
కాంగ్రెస్‌ను పాతరేస్తేనే బంగరు తెలంగాణ
ప్రాజెక్టులు అడ్డుకుంటూ.. రైతుల నోట్లో మట్టికొడ్తున్నరు ► కాంగ్రెస్ నాయకులకు రాజకీయ నిరుద్యోగ భృతి ఇస్తాం ► జగిత్యాల జనహిత ప్రగతి సభలో కేటీఆర్ సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్‌ను ఉప్పుపాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అపురూపమైన కార్యక్ర మాలు, పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెసోళ్లకు మనసునపట్టక.. మూడేళ్లు కూడా నిండని ముక్కుపచ్చలారని ప్రభుత్వంపై మాటల యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. మేం అధి కారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తమని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నడు.. కానీ, ‘అన్నా.. పొరపా టున కూడా కేంద్రం కానీ.. రాష్ట్రంలో కానీ మళ్లీ మీరు అధికారంలోకి రారు. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయే మీకు నిరుద్యో గ భృతి ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీయే’ అన్నారు. ధర్మపురి, కొండగట్టు అభివృద్ధి... ధర్మపురిలోని లక్ష్మీనృసింహస్వామి, కొండ గట్టు ఆంజనేయస్వామి దేవాలయాలను యాదాద్రి, వేములవాడ ఆలయాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందు తున్నాయని చెప్పారు. ఎన్నికలు 2018లో వచ్చినా.. దానికి ముందొచ్చినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో ఎమ్మెల్యే సీటు కోల్పోయిన జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పాల నను సంక్షేమానికి స్వర్ణయుగంగా.. దేశా నికే ఆదర్శంగా అభివర్ణించారు. సోమవారం జగి త్యాలలో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన ప్రసంగించారు. కృష్ణా.. గోదావరి నదుల నుంచి న్యాయబద్ధంగా తెలంగాణకు రావల్సిన 1,200 టీఎంసీల జలాల వాటా కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాల శీర్షిక మీద పని చేస్తోన్న సీఎం.. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై బ్యారేజీల నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. తద్వారా పూర్వ కరీం నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఇక్కడి సగం గోదావరి నీళ్లను ఉత్తర తెలంగాణకు తరలించి, సస్యశ్యామలం చేసేం దుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చనిపోయిన వారి పేర్లతో కోర్టులో కేసులేస్తూ, ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. రైతుల నోట్లో మట్టికొడు తున్నారని చెప్పారు. 2004లో కేంద్రంలో ఉనికిపోయిన కాంగ్రెస్ పార్టీ అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిందన్నారు. నాడు తెలంగాణ ఇస్తామని మాటిచ్చి ముఖం చాటేసిన యూపీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. కేంద్ర పదవిని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి పదవికి బేరం కుదుర్చుకున్న జీవన్‌రెడ్డి 2006 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2001 వరకు కేవలం రాజమండ్రి వరకే గోదావరి పుష్కరాలు పరిమితమయ్యాయని కేటీఆర్ చెప్పారు. కానీ 2001 ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణలోనూ గోదావరి పారుతుందని చెప్పి... నాటి సీఎం చంద్ర బాబునాయుడిని ధర్మపురికి రప్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. ఎరువుల కోసం ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రకటించారన్నారు. పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎరువులను పంపిణీ చేసిన ఘనత మీది కాదా అని కాంగ్రెస్ నేతల ను ప్రశ్నించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, నిరుపేద విద్యార్థులకు సన్నబియ్యం పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన దమ్ము న్న నేత సీఎం కేసీఆర్‌యే అన్నారు. కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనను దుర్మర్గపు పాలనగా అభివర్ణించారు. మూడేళ్లలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించారన్నా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పాలనలో టీఆర్ఎస్ విజయవంతమైంది: ఈటల
వరంగల్: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యమ పార్టీలు పాలనలో విఫలమయ్యాయి.కానీ తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీ పాలనలో సఫలమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎన్నికల హామీల అమలుపై మంత్రి మాట్లాడుతూ..‘‘ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో టీఆర్ఎస్ సర్కార్ సఫలమైంది. రాష్ట్రంలోని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలో మరెక్కడా ఉద్యమ పార్టీలు పాలనలో మంచి పేరు సాధించిన దాఖలాలు లేవు మన రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో సఫలమైంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో టీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందోనని అందరు సంశయించారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవెర్చన పార్టీ దేశం మొత్తంలో టీఆర్ఎస్ మాత్రమే. మనం అమలు చేస్తున్న పథకాలు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని’’ ఈటల రాజేందర్ అన్నారు. -
విడతలవారీ కరెంటే నయం!
►నిరంతర విద్యుత్ వల్ల బావుల్లో నీరు అడుగంటుతోంది: తుమ్మల ► విడతలవారీగా అంటే సీఎం కేసీఆర్ ఒప్పుకోరు: మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి మించి నీళ్లు ఇవ్వడం వల్ల పామాయిల్ తోటల దిగు బడి కూడా తగ్గుతోంది. అందుకే మా ప్రాంత రైతుల కోరిక మేరకు తొమ్మిది గంటలు కాకుండా రెండు, మూడు విడతల్లో కరెంటు ఇవ్వాలని కోరుతున్నా..’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతులు గట్టిగా డిమాండ్ చేస్తే.. ఒకే ఫీడర్ కింద ఉన్న రెండు, మూడు గ్రామాల రైతులు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇస్తే విడతలవారీగా సరఫరాకు ఆలోచన చేస్తాం’ అని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలోని మంత్రి ఈటల రాజేందర్ చాంబర్లో ఈ ఇద్దరు మంత్రుల మధ్య విద్యుత్ సరఫరాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ మంత్రులు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల మోటార్లు పూర్తిగా ఆన్‌లోనే ఉంటున్నాయని, దీంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నాయని, ఫలితంగా భూగర్భ జలమట్టం పడిపోతోందని తుమ్మల అన్నారు. తెలంగాణలోని చాలాప్రాంతాల్లో నిరంతర కరెంటు వల్ల బావుల్లో నీరు అడుగంటిపోతోందని, తిరిగి ఊరడానికి సమయం పడుతోందని, విడతల వారీగా కరెంటు ఇస్తే రైతు లకు వెసులుబాటు ఉంటుందని తుమ్మల నాగేశ్వర్రావు విశ్లేషించారు. విడతలవారీగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, అయినా, రైతులు చెబుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని జగదీశ్‌రెడ్డి అన్నారు. కరెంటు కోత పెట్టాల్సిన పరిస్థితులు తెలంగాణలో లేవని చెప్పారు. 2004 మార్చి నాటికి ఇప్పటికీ కరెంటు డిమాండ్ పెరిగినా, ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇక, ఇప్పుడు ఏపీ కరెంటు కూడా అవసరం లేదని, ఇతర ప్రాంతాల కంటే ఏపీ కరెంటు ధర ఎక్కువని అన్నారు. ఇప్పటికీ పది గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వగలు గుతామని, వచ్చే ఏడాదయితే ఇరవై నాలుగు గంటలూ పవర్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పేదలకు చదువు భారం దించాం
► రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంథని: గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులపై చదువు భారం పడకుండా తమ ప్రభుత్వం కొత్త కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంథని, కమాన్ పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. మంథనిలో రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివిన వ్యక్తి హోంగార్డు కోసం, ఎంబీఏ చదివినవారు చిన్న ఉద్యోగం కోసం పోటీపడడం చూస్తే బాధేసిందన్నారు. అలాంటి కష్టాలను తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మారుమూల గిరిజన తడాల్లో గుడిసెల్లో విద్యార్థులు గొప్పగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే హాస్టళ్లలో సన్నబియ్యం పెడుతూ పేద విద్యార్థుల కడుపు నింపున్నామన్నారు. మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంటు మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. ఇటీవల నర్మదానదిని సందర్శించామని, అక్కడి మాదిరిగా మంథని బొక్కలవాగును అభివృద్ధి చేసి వేలాది మంది పర్యాటకులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఎన్ని కోట్ల నిధులైనా కేటాయిస్తానని హామీఇచ్చారు. ఒకనాడు హింసను, దుఖాన్ని అనుభవించిన ప్రాంతమని, వారి కష్టాలను తీర్చుతామని తెలిపారు. ఆపద వస్తే నేనున్నానని భరోసా కల్పించేవారే ప్రజాప్రతినిధి అని, అలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంథని నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని చెప్పారు. రూ.4.10కోట్లు స్వశక్తి రుణాలు, కోటి రూపాయల స్త్రీనిధి రుణాల చెక్కును అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ అంజయ్య, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, మంథని, ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, జెడ్పీటీసీలు మూల సరోజన, రాజిరెడ్డి, శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్ పాల్గొన్నారు. కరెంట్ కష్టాలు తీర్చడానికే సబ్‌స్టేన్ నిర్మాణం కమాన్ పూర్: లోవోలే్టజీ కరెంట్ కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ సంకల్పంతో సబ్‌స్టేన్ ల నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యవసాయరంగానికి నిరంతరంగా పగలు తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కమాన్ పూర్ మండలం గుండారంలో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేన్ బీటీ రోడ్డులను ప్రారంభించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తీర్చడానికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపీపీ ఇనగంటి ప్రేమతల, ఏఎంసీ చైర్మన్ పీట్ల మంజూల. పీఏసీఎస్ చైర్మన్లు బాద్రపు మల్లేష్, మల్క రామస్వామి పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల్లో డీబీటీ
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డీబీటీ (నేరుగా లబ్ధి బదిలీ) పద్ధతిని అమలు చేస్తాం. ఇప్పటికే గ్యాస్ రాయితీ పంపిణీలో డీబీటీ అమలు చేయడంతో ఏటా ప్రభుత్వానికి రూ. 28 వేల కోట్లు ఆదా అవుతుంది. త్వరలో అన్ని పథకాల్లో డీబీటీ అమలు చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాతో పాటు లబ్ధిదారుడి ఖాతాకు రాయితీ నిధులు చేరతాయి. అవకతవకలకు తావుండదు’అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం పీపుల్స్‌ప్లాజాలో డిజీ ధన్ మేళాను కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో తీసుకొచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకం లాటరీని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి తెరిచారు. విజేతలకు బహుమతులను, క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించిన వారికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మికుల వేతనాల చెల్లింపులపై త్వరలో చట్టం తీసుకు వస్తామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాల్లో జమయ్యేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కొంత ఇబ్బంది పడ్డా ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రూ. 32 వేల కోట్ల కొత్తనోట్లు వచ్చాయి. వీటిని అన్ని బ్యాంకులకు పంపిణీ చేశాం. రెండ్రోజుల్లో మరో 500 కోట్లు బ్యాంకులకు చేరతాయి. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం నోట్ల రద్దుపై గోల చేస్తున్నాయి. ప్రజలు వాటిని విశ్వసించరు’అని అన్నారు. మరో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ సాంకేతిక విప్లవం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, పేదల జీవనోపాధుల అభివృద్ధికి సాంకేతిక సేవలు దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ.. పలు గ్రామాలను ఇప్పటికే నగదురహిత గ్రామాలుగా రూపొందిస్తోందని అన్నారు. బ్యాంకు ఖాతాకు నగదు ప్రోత్సాహకాలు... నగదు రహిత లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు అమల్లోకి తెచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకంలో విజేతలకు అన్లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నీతి ఆయోగ్ సలహాదారులు అశోక్‌కుమార్ జైన్ తెలిపారు. లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామన్నారు. బుధవారం నాటి డ్రాలో 358 బ్యాంకులకు సంబంధించి 15వేల మంది విజేతలను ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, గురువారం కూడా ఈ మేళాను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించం
పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. శనివారం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాఖ పనితీరు మెరుగుపడిందన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) గణనీయ ప్రగతి సాధిం చిందని తెలిపారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రతిపా దనలు చేయగా.. ఇప్పటివరకు 15.28లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందన్నారు. ఇందులో 15 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లింగ్కి ఇచ్చామని, శని వారం నాటికి 5.85 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లోకి చేరిందని తెలిపారు. మిగిలిన బియ్యాన్ని వీలైనంత త్వరగా అందించాలని మిల్లర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇస్తున్నామని, ఓపెన్ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సీఎంఆర్ పద్ధతిలో బియ్యా న్ని సేకరిస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు సైతం మద్దతు ధర అందుతుందన్నారు. పేద విద్యార్థులకు అందించే బియ్యంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
-
గ్రామాలకు డబ్బు పంపండి
- బ్యాంకర్లను కోరిన మంత్రి ఈటల - రైతులకు రూ.24 వేలు అందేలా చూడండి - చిన్న నోట్లను అందుబాటులో ఉంచండి - సీఎస్, బ్యాంకర్లతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు కావొస్తున్నా బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నోట్ల రద్దు ప్రభావం, నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ బ్యాంకుల అధికారులతో మంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ప్రతి పూట, ప్రతి రోజు పర్యవేక్షించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అధికారులు, బ్యాంకర్లు సమష్టిగా కృషి చేసి వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చూడాలన్నారు. పట్టణ ప్రజలకు బ్యాంకులు, డిజిటల్ చెల్లింపులపై కొంత అవగాహన ఉంటుందని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బ్యాంకు ముఖం చూడని వారుంటారని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ డబ్బు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరారు. రూ.24 వేలు డ్రా చేసుకునేందుకు అనుమతించినా రైతులకు ఇవ్వటం లేదని, వారికి డబ్బు అందేలా చూడాలన్నారు. ప్రజల ఇబ్బందులు పోవాలంటే సరిపడేన్ని చిన్న నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఏటీఎంల సంఖ్య పెంచండి నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లను ఈటల కోరారు. ఎక్కువగా స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని, ఏటీఎంల సంఖ్య పెంచాలని కోరారు. నగదు రహిత విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని, అందులో 70 లక్షల మంది రూపే కార్డులు తీసుకున్నారని వివరించారు. అందులో 46 లక్షల కార్డులు ఇప్పటికీ పని చేయటం లేదన్నారు. నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.15,583 కోట్ల నగదు రాష్ట్రానికి వచ్చిందని, అందులో 94 శాతానికి పైగా రూ.2 వేల నోట్లు ఉండటంతో చిల్లర సమస్య వచ్చిందన్నారు. అందుకే చిన్న నోట్లు కేటారుుంచాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. -
వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈటల సాక్షి, న్యూఢిల్లీ: కౌలు రైతులను జీఎస్టీ బిల్లులో వ్యవసా యదారుల జాబితాలో చేర్చాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ ఐదో సమావేశంలో రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. జీఎస్టీ ముసాయిదా బిల్లులో సొంత భూమిలో వ్యవసాయం చేసే వారిని మాత్రమే వ్యవసాయదారులుగా పేర్కొ న్నారని, దీని వల్ల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు నష్టపో తారని వివరించినట్టు చెప్పారు. డైరీ, పౌల్ట్రీ, హార్టి, సెరీకల్చర్లను వ్యవసా యరంగ జాబితాలో చేర్చాలని అన్ని రాష్ట్రాలు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణకు రావాల్సిన రూ.450 కోట్లను విడుదల చేయాలని మంత్రిని కోరినట్టు ఈటల తెలిపారు. -
చక్కెరకు జీఎస్టీ పన్ను పోటు వద్దు
మంత్రి ఈటలకు షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: చక్కెర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఈటలతో భేటీ అయ్యారు. జీఎస్టీ అమలవనున్న నేపథ్యంలో చక్కెరపై పన్నులు విధిస్తే నేరుగా చెరుకు పండించే రైతులపై ఏ మేరకు భారం పడుతుందనే కోణంలో చర్చించారు. చక్కెర వినియోగంలో భారత్ మొదటిస్థానంలో, తయారీలో రెండోస్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంపై జీఎస్టీ పన్ను పోటు లేకుండా చూడాలని అసోసియేషన్ అధ్యక్షుడు సరితారెడ్డి, కార్యదర్శి భలేరావు విజ్ఞప్తి చేశారు. చక్కెర పరిశ్రమను 6 శాతం పన్నుల కేటగిరీలోకి తీసుకురావాలని, ఇథనాల్ తయారీపై ఎలాంటి వడ్డింపులు లేకుండా చూడాలని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. -
తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం
- ఢిల్లీ బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ - హాజరైన కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎ న్నటికీ మర్చిపోలేమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా తొలుత తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ సంప్రదాయం ప్రకారం.. గౌరమ్మను పూజించి, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాననీ, ఆనాటి ఉద్యమ రూపాల్ని, ప్రజల స్పందనను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పండుగలకు, సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమనీ, పంటలన్నీ చేతికొచ్చాక ప్రజలు సంతోషంగా జరుపుకొనే ప్రకృతి పండుగ.. బతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు డీఎస్, కెప్టెన్ నామినేషన్లు
ఎన్నిక ఏకగ్రీవమే: ఈటల ఎంఐఎం మద్దతిస్తోంది: నాయిని సాక్షి, హైదరాబాద్: రాజ్యసభకు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారని ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, 31న ఉదయం 11 గంటలకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజ సదారాంకు అందజేస్తారని చెప్పారు. ఎంఐఎం తమకు మద్దతిస్తోందని, నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీని ఆహ్వానించామని నాయిని తెలిపారు. నామినేషన్ పత్రాలపై ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేస్తారని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు తెలంగాణ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న సీనియర్ నాయకులని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఒక్కో సీటును గెలుచుకోవడానికి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, టీఆర్ఎస్కు తప్ప ఆ సంఖ్య ఏ పార్టీకీ లేద న్నారు. రెండు స్థానాలనూ గెలుచుకుంటామని, ఏకగ్రీవం అయ్యేలా పార్టీలు సహకరిస్తాయన్న విశ్వాసం ఉందని ఈటల పేర్కొన్నారు. దారుస్సలాంకు టీఆర్ఎస్ నేతలు.. అంతకుముందు నాయిని, ఈటల, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. దారుస్సలాంలో ఉన్న ఎంఐఎం పార్టీ కార్యాలయానికి వెళ్లిన వారికి ఒవైసీ సాదర స్వాగతం పలికారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని మంత్రులు కోరగా... మిత్రపక్షమైన టీఆర్ఎస్కు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అసదుద్దీన్ తెలిపారు. -
ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు?
కొద్ది రోజులు నిషేధం సడలించే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కొద్దిరోజుల పాటు నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉద్యోగుల బది లీలపై నిషేధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా ఈ నిషేధం అమల్లో ఉంది. దీంతో వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు వివిధ కారణాలతో తమను బదిలీ చేయాలని కోరుతూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వ్యక్తిగత అభ్యర్థనలతో నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మంత్రులపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు సాధారణ బదిలీలలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కనీసం వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తల బదిలీలకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో కొద్ది రోజులు నిషేధం సడలించి కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలి స్తోంది. అందుకే ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఏప్రిల్‌లో బదిలీల కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సైతం ఏప్రిల్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రతిపాదనను ప్రభుత్వం చివరి నిమిషంలో తోసిపుచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ పూర్తి కాకపోవటం, అన్ని శాఖల మధ్య ఉద్యోగుల కేటాయింపు కసరత్తు జరుగుతుండటంతో బదిలీలపై వెనక్కి తగ్గింది. రెండ్రోజుల కిందట టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి మరోమారు బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఉద్యోగుల బదిలీలతో పాటు హెల్త్‌కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
టీఆర్ఎస్ మాట్లాడింది గంట 26 నిమిషాలే
కాంగ్రెస్ 2.53 గంటలు: సీఎం సాక్షి,హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ప్పటి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు టీఆర్ఎస్ మాట్లాడింది కేవలం గంటా 26 నిమిషాలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పదేళ్ల కాంగ్రెస్ హయాంలో, ఇరవై నెలల టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అందుకు వెచ్చించిన నిధుల గురించి పోలుస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్ అడ్డుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రాబడి, ఖర్చుకు ప్రస్తుత పరిస్థితికి తేడా ఉందని జానారెడ్డి చెప్పగా.. కాంగ్రెస్ చేయలేదనే టీఆర్ఎస్ను గెలిపించారని, పోలికలు ఎందుకని లక్ష్మణ్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఈటలకు, ప్రతిపక్షసభ్యులకు వాగ్వాదం జరుగుతుండగా, సీఎం జోక్యం చేసుకున్నారు. ‘అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని విని సంస్కారవంతంగా వ్యవహరించాలని జానా చెప్పారు. మీరు మాట్లాడితే సంస్కారం, మేం మాట్లాడితే కు సంస్కారమా?’ అని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు సభలో టీఆర్ఎస్ సభ్యులు కేవలం గంట 26 నిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 2 గంటల 53 నిమిషాలు మాట్లాడారని ముఖ్య మంత్రి కేసీఆర్ వెల్లడించారు. -
ఇది గల్లా ఎగరేసిన తెలంగాణ
వాస్తవిక, ప్రజా కోణంలోనే బడ్జెట్: ఈటల సాక్షి, హైదరాబాద్: ‘గతంలో మాదిరిగా తెలంగాణ ప్రజలు చిన్నగా, గరీబులుగా, దిక్కులేని వాళ్లుగా ఉండాలని కోరుకోవడం లేదు. కన్నీళ్లు, కష్టాలు, వలస పాటలు పాడుకునే దుస్థితి మారాలి. అప్పటి సమస్యలన్నీ మా కళ్ల ముందున్నాయి. అందుకే ప్రజలకు భరోసా కల్పించే దృక్పథంతో ఈ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణ గల్లా ఎగరేసుకుని నిలబడాలి..’’ అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వాస్తవిక, ప్రజా కోణం ఉన్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని.. తమ ఆలోచన, పనివిధానం సంక్షేమం చుట్టూనే తిరుగుతుం దన్నా బడ్జెట్‌పై జరిగిన చర్చకు శనివారం ఈటల సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత బడ్జెట్లో 86.5 శాతం ఖర్చు ఏ రాష్ట్రం కూడా వందకు వంద శాతం బడ్జెట్‌ను ఖర్చు చేయలేదని ఈటల పేర్కొన్నారు. రాబడి, ఖర్చుల లెక్కలు పక్కాగా చూడడానికి ప్రభుత్వం ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాదని.. రాబడిని అంచనా వేసి ఖర్చు చేస్తారని స్పష్టం చేశారు. 2015-16 బడ్జెట్లో 86.5 శాతం మేర ఖర్చు పెడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ 80 శాతానికి మించి బడ్జెట్ ఖర్చు చేయలేదని చెప్పారు. రెవెన్యూ వృద్ధిరేటు పెరగడంతో 2016-17లో కేటాయించిన రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు. కరెంటు, నీళ్లు, సంక్షేమం.. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారమేనన్న విమర్శలు పటాపంచలయ్యాయని, నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. రైస్, కాటన్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిశ్రమలకు 24గంటల విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు పగటిపూటే ఇస్తున్నాం. భద్రాద్రి ప్రాజెక్టు పని మొదలైంది. యాదాద్రిలో 800మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లు సిద్ధం చేస్తున్నాం. సింగరేణి, ఎన్టీపీసీ విద్యుదుత్పత్తికి ముందుకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ.16,169కోట్లు పెట్టినం. రూపాయికి కిలో బియ్యం పథకం కోసం కేంద్ర నిధులకు అదనంగా రూ.2,800కోట్లు ఖర్చు పెడుతున్నాం. సన్నబియ్యానికి రూ.700కోట్లు ఖర్చు పెట్టాం. ఇరవై నెలల్లోనే 5,706 కిలోమీటర్ల రోడ్లు వేశాం. 8,138 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు వేశాం. పదేళ్ల కాంగ్రెస్ హయంలో అది 2,383 కిలోమీటర్లే..’’ అని వివరించారు. రైతాంగానికి రూ.40వేల కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.5వేల కోట్లు ఇస్తున్నామని, బడ్జెట్లో రైతులకు రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఈటల పేర్కొన్నారు. వేల కోట్లు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వేల కోట్లు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. పైసల చుట్టూనే మీ యావ బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపక్షాల విమర్శలకు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సభ్యులు చేసిన విమర్శలపై స్పందిస్తూ ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీ యావ అంతా పైసల చుట్టూ తిరిగిందే తప్ప మనిషి చుట్టు తిరగలేదు’ అని వ్యాఖ్యానిం చారు. ప్రజలను ఎప్పుడూ ఫూల్స్ చేయలేరన్న భట్టి మాట లను ఉటంకిస్తూ అవి కాంగ్రెస్ వాళ్లకే వర్తిస్తాయని కౌంటర్ ఇచ్చారు. ‘వరంగల్, నారాయణఖేడ్, ఖమ్మం, హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు ఇవే విషయాలను ఇంతకన్నా ఫోర్స్‌గా చెప్పారు. అయినా ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఈటల తన ప్రసంగంలో పలు సామెతలను వాడి ఆకట్టుకున్నారు. ‘పరిగ ఏరుకుంటే రాదు బిడ్డా.. పంట పండితేనే సంతోషం వస్తది’ అని రైతుల స్థితిగతులపై సమాధానమిచ్చారు. ఏడాది పొడవునా తాగునీరు రెండేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బంది రావద్దనేది తమ ఆలోచన అని ఈటల చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాదిలోనే 6,100 గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు నీళ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో 216 పథకాలు ప్రకటించామని, అవేవో ప్రతిపక్షాలకు కూడా తెలియవని వ్యాఖ్యానించారు. ‘‘ఆటోలు, ట్రాక్టర్ల మీద ఎన్నెన్నో కేసులుండేవి. పాత బకాయిలు రద్దు చేసి పన్ను తొలగించాం. జర్నలిస్టులకు రూ.వంద కోట్లతో బడ్జెట్ పెట్టాం. ప్రమాదాల్లో చనిపోయే డ్రైవర్లకు, హోంగార్డులకు రూ.5లక్షల బీమా కల్పించాం. రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నాలు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం జీతాలు పెంచాం. హోంగార్డులకు కూడా రూ.12వేలు జీతమిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే..’’ అని ఈటల పేర్కొన్నారు. కొద్దికాలంలో దేశంలోనే నేరాలు తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందని, శాంతిభద్రతల పరిరక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో నాలుగు కొత్త ఆసుపత్రులకు త్వరలోనే పునాది రాయి వేస్తామని.. కరీంనగర్, ఖమ్మంలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామని చెప్పారు. -
అబద్ధాల కనికట్టు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, అబద్ధాల కనికట్టు అని బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బడ్జెట్‌పై అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. కీలకరంగాలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రధానమైన అంశాలకు నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో ఒక పక్క తీవ్ర కరువు పరిస్థితులు, మరో పక్క రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయరంగాన్ని బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పటిదాకా ఆర్భాటంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ విద్యను ఎందుకు ప్రారంభించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. వైద్యరంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యంచేశారని అన్నారు. గొప్పలకు పోయి రాష్ట్ర బడ్జెట్‌ను అంకెల్లో భారీగా పెంచి చూపిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో చూపించిన లెక్కలకు, వాస్తవంగా ఖర్చు చేస్తున్న నిధులకు భారీ వ్యత్యాసముందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబల్ బెడ్రూముల ఇళ్లు వంటి ముఖ్యమైన పథకాలను బడ్జెట్లో ప్రస్తావించకుండా నిధులను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పథకాలను ప్రకటించడం, అప్పులు తెస్తామని చెప్పడం తప్ప ఈ బడ్జెట్లో ఏముందని ప్రశ్నించారు. అప్పులను పెంచుకుంటూ పోతే దానికి బాధ్యులెవరు అని లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిందేమీ లేదన్నారు. అంకెలగారడీ, మాయమాటలతో రాష్ట్ర ప్రజలను ఈ బడ్జెట్ ద్వారా మరోసారి మోసం చేశారని విమర్శించారు. -
ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్ కంపెనీ
♦ రూ.5 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ సుముఖం ♦ సీఎం కేసీఆర్‌తో కంపెనీ భారతీయ ప్రతినిధుల భేటీ ♦ శ్రీలంకలో కంపెనీ నిర్మించిన ఆసుపత్రులను పరిశీలించనున్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మొత్తాన్ని రుణంగా అందజేయనుంది. ఈ మేరకు ఆ దేశ ఎన్రాఫ్-నోనియస్ కంపెనీకి చెందిన భార తదేశ అధిపతి సునీల్ అగర్వాల్, లైసన్ డెరైక్టర్ హిలాల్ రాదర్, నిర్మాణ డెరైక్టర్ సురేష్‌గుప్తా తదితరులు మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రుల డిజైన్, నిర్మాణం, నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. ఆసుపత్రుల నిర్మాణానికి నెదర్లాండ్ కంపెనీ ముందుకు రావడం పట్ల సీఎం సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో 5 వేలకుపైగా పడకలతో ఆసుపత్రులను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. కాలవ్యవధిని, రుణానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేయాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీలంక, దుబాయ్‌ల్లో ఇలాంటివి నిర్మించామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ వారంలో శ్రీలంకలో పర్యటించి ఎన్రాఫ్-నోనియస్ నిర్మించిన ఆసుపత్రులను, వసతులను అధ్యయనం చేసి రావాల్సిందిగా మంత్రి లక్ష్మారెడ్డిని, ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డయాగ్నస్టిక్ విభాగాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆ కంపెనీ నిర్మించిందని సీఎం కార్యాలయం పేర్కొంది. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అధికారులు రాజేశ్వర్ తివారీ, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకనైనా బకాయిలు ఇవ్వండి
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ♦ రూ.47వేల కోట్లకు మరోసారి అభ్యర్థనలు ♦ 4 నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ♦ ఏ నెలకానెలా బొటాబొటిగా సరిపోతున్న ఆదాయం సాక్షి, హైదరాబాద్: తమకు రావాల్సిన బకాయిలను త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఏడాదిగా పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను మరోమారు ఏకరవు పెట్టింది. వివిధ అంశాలపై దాదాపు రూ.47 వేల కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ప్రతిపాదనలను పంపింది. కరువు సాయంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలు, బడ్జెట్ సాయం, ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టు పేరిట ఈ నిధులను కోరింది. రాష్ట్ర ఆదాయం ఏ నెలకానెలా బొటాబొటిగా సరిపోతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భారీ పథకాలకు నిధుల కటకట నెలకొంది. మరోవైపు కేంద్రం నుంచి ఆశించినంత సహకారం లేకపోవటం అశనిపాతంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నాలుగు నెలలే ఉంది. ఈలోగా తమకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలని రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. కనీస ప్యాకేజీ ఇవ్వండి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు ప్రతిపాదనలు పంపించింది. రూ.35వేల కోట్లకుపైగా ఉన్న దీన్ని నీతి ఆయోగ్ సూచనల మేరకు రూ.30,571 కోట్లకు సవరించింది. ఇటీవలే ఏపీలో వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేంద్రం రూ.350 కోట్లు విడుదల చేసింది. కానీ తెలంగాణ ఊసెత్తలేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా ఈ ప్యాకేజీని గుర్తు చేయటంతో పాటు రూ.1,000 కోట్లు తక్షణ సాయంగా ఇవ్వాలని కోరారు. ఏడాదిగా సీఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి రూ.7,182 కోట్ల సీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. బకాయిల్లో మూడో వంతు నిధులు చెల్లిస్తామని కేంద్రం మార్చిలోనే హామీ ఇచ్చినా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుకు రూ.407 కోట్లు కావాలంటూ ఇటీవలే నీతి ఆయోగ్ నుంచి ఆర్థిక సాయం కోరింది. తప్పిన కేంద్ర సాయం అంచనాలు ఈ ఏడాది కేంద్రం నుంచి వివిధ గ్రాంట్లు, పన్నుల ద్వారా మొత్తం రూ.25,223 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా పెరిగినప్పటికీ రాష్ట్రానికి వచ్చే నిధుల శాతం తగ్గటంతో రాష్ట్రం రూ. 2,389 కోట్లు నష్టపోయింది. మరోవైపు కేంద్ర పథకాలకయ్యే ఖర్చులో రాష్ట్ర వాటాను పెంచడం అదనపు భారమైంది. ఈ నేపథ్యంలో పన్నుల వాటాను మినహాయించి బడ్జెట్లో అంచనా వేసుకున్నట్లుగా తమకు రావాల్సిన రూ.6,653 కోట్లు విడుదల చేయాలని లేఖ రాసింది. వీటితో పాటు కరువు దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో రూ.2,514 కోట్ల సాయం కోరింది. -
కొత్త వ్యవస్థకు గ్రామజ్యోతి పునాది
కరీంనగర్ సిటీ :రాష్ట్రంలో నూతన వ్యవస్థకు గ్రామజ్యోతి కార్యక్రమం పునాది అని రాష్ట్ర ఆర్థిక, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఉదయం గ్రామజ్యో తి నోడల్ అధికారులకు, మధ్యాహ్నం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు అవగాహన స దస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై న ఈటల మాట్లాడుతూ జన్మభూమి, ప్రజాపథం, రచ్చబండ తదితర పేర్లతో గత ప్రభుత్వాలు హడావుడి చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. గ్రామసభలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, కాని ఇప్పటివరకు జరిగిన గ్రామసభలు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాయని అన్నారు. గ్రామసభల్లో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న పాపానపోవడం లేదన్నారు. అధికారికి దగ్గరైతే, అధికార పార్టీ కార్యకర్త అయితేనో, ఎమ్మెల్యే చెబితే నో పనులు జరుగుతున్నాయనే భావన ఉందన్నారు. అలాకాకుండా గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. పా త వ్యవస్థ పోయి కొత్త విధానానికి గ్రామజ్యోతి అంకురార్పణ కావాలన్నారు. గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తే కలెక్టరేట్ వరకు ప్రజలు రారన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ధర్మం, నీతిని పాటించాలని హితవు పలికారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 15న గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయూన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు పునర్జీవం పోసేదే గ్రామజ్యోతి కార్యక్రమమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బంగారు తెలంగాణ కోసం గ్రామజ్యోతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిపివేయడంతో జిల్లా పరిషత్‌లకు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. నిధుల కోసం సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వర్షాలు పడినందున గ్రామజ్యోతిలో హరితహారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, ఏజేసీ నాగేంద్ర, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, డీపీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై మంత్రులు..
సాక్షి నెట్వర్క్: పుష్కరాలకు భారీగా జనం రావడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుల్లెట్ బైక్‌లపై అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇక్కడి ధర్మారం నుంచి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి వరకు బైక్‌లపై వెళుతూ.. ఆగి ఉన్న వాహనాలను క్లియర్ చేశారు. తర్వాత ధర్మపురి వరకు రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక భద్రాచలంలో ట్రాఫిక్ అంతరాయాన్ని సరిదిద్దేందుకు మంత్రులు తుమ్మల, జగదీశ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం రాత్రి వారు భద్రాచలంలోని ప్రధాన రహదారిపై తిరుగుతూ అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా పాల్వంచ శివారులో వేలాది వాహనాలు నిలిచిపోవడంతో డీజీపీ అనురాగ్‌శర్మ హెలికాప్టర్ ద్వారా పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. పుష్కర స్నానం చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియారెడ్డి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ సమీపంలో గోదావరి పుష్కర స్నానం చేశారు. వారు కాళేశ్వరం వెళ్లాల్సి ఉన్నా.. తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కారణంగా మహదేవపూర్ సమీపంలో పుష్కరస్నానం ఆచరించారు. భద్రాచలంలో ఎక్కడ చూసినా జనజాతరే. శనివారం ఇక్కడ పుష్కర స్నానాలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. ఇది భద్రాచలంలో రికార్డు.భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలన్నీ టోల్గేట్ల వద్ద నిలిచిపోవాల్సి రావడంతో.. పలు చోట్ల టోల్ వసూలు చేయకుండానే వదిలివేశారు. వాహనాలు తగ్గినప్పుడు ఆపి టోల్ వసూలు చేస్తూ, వాటి సంఖ్య పెరగగానే వదిలివేశారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి
6 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా మంత్రులు అల్లోల, ఈటల, జోగు రామన్న గోదావరిఖని/ధర్మపురి: గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్నలు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ధర్మపురి వద్ద చేపడుతున్న పుష్కర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2003లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 27 ఘాట్ల వద్ద పుష్కరాలు నిర్వహించగా... తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్ల ఖర్చు చేసి 106 చోట్ల పుష్కరఘాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు అన్ని చోట్ల పుష్కర పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత పుష్కరాల సమయంలో మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తే... ఈసారి 6-8 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.