
‘ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఇది నటీ నటులకు, క్రీడాకారులకు మాత్రమే కాదు అందరికీ అవసరమే’ అన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. కోకాపేటలో సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ ఏర్పాటు చేసిన ఎఫ్– 45 జిమ్ సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాయామం అంటే జిమ్, మజిల్ బిల్డింగ్ మాత్రమే కాదని, ఎండ్యురెన్స్, స్టామినా పెంచే రన్నింగ్ వంటివన్నీ అవసరమే అన్నారు.
ఫిట్ సిటీగా హైదరాబాద్..
సినీనటి, ఎఫ్– 45 నిర్వాహకురాలు రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గచ్చిబౌలి తర్వాత ఇది తన రెండో శాఖ అని చెప్పారు. హైదరాబాద్‌ను ఫిట్‌నెస్
అవేర్‌నెస్ సిటీగా మార్చాలనుకుంటున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment