ఇచ్చింది గ్రాంటు కాదు.. పాత బకాయి
ఆర్టీసీకి రూ.250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
దసరా అడ్వాన్సు చెల్లింపునకు మార్గం సుగమం
దారిమళ్లిన సీసీఎస్, పీఎఫ్ మొత్తం తిరిగి చెల్లింపు
అదనపు గ్రాంటు ఊసెత్తని సర్కారు
హైదరాబాద్: భారీ నష్టాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీకి తాను బకాయిపడ్డ రీయింబర్స్‌మెంటు మొత్తం నుంచి ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసింది. వివిధ వర్గాలకు ఇచ్చే బస్సు పాసుల రాయితీలకు సంబంధించి గత రెండేళ్లుగా ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయటం లేదు. ఓవైపు నష్టాలు, మరోవైపు ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయటంతో ఆర్టీసీ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దీంతో తక్షణం రూ.250 కోట్ల అదనపు సాయా న్ని ప్రకటించాలని గత నెలలో యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని గ్రాంటు గా ఇవ్వాలని విజ్ఞప్తి చే సింది. మంత్రులు హరీశ్ రావు, మహేందర్‌రెడ్డి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిమరీ దీనిపై అధికారులతో చర్చించి... ఆర్థికసాయం కోసం సీఎంకు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించటంతో అంతమేర గ్రాంటు దక్కనుందని ఆర్టీసీ సంబరపడింది. ప్రభుత్వం మాత్రం అదనపు సాయంగా గ్రాం టును ప్రకటించకుండా... ఆర్టీసీకి బకాయిపడ్డ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ అందులోనే...
ఏడాదికాలంలో ఆర్టీసీ ఏకంగా రూ.వెరుు్య కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కార్మికుల పీఎఫ్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నిధులనూ వాడుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కార్మికులు సమ్మెకు సిద్ధం కావటం తో వాటిని చెల్లిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిం ది. తాజా ఉత్తర్వుల మేరకు... 2012-13 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాయితీ పాసుల రీయిం బర్స్‌మెంటు రూ.218.80 కోట్లు, 2013-14కు సంబంధించి ఆడిట్ పూర్తి కానందున అడ్వాన్సు గా రూ.31.20 కోట్లు... వెరిసి రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని సీసీఎస్, పీఎఫ్ బకాయిలతోపాటు దసరా పండగ అడ్వాన్సుకింద రూ.35 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ నిధులు కాస్తా ఖర్చు కానుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని ఆర్టీసీ ఆందోళన చెందుతోంది.
సీఎంకు కృతజ్ఞతలు..
ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.250 కోట్ల సాయా న్ని ప్రకటించాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిధులు విడుదల చేశారని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తవు విన్నపానికి సానుకూలంగా స్పందించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నిధులతో సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, దసరా అడ్వాన్సు చెల్లించనున్నట్టు తెలిపారు.