కుల్కచర్ల: నివాళులు అర్పిస్తున్న ప్రహ్లాద్‌రావు తదితరులు
అనంతగిరి వికారాబాద్ : మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశప్రజలంతా మెచ్చిన నేత వాజ్‌పేయి అని కొనియాడారు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా తన మాటలతో అందరిని ఆకట్టుకున్నారన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుల్లో వాజ్‌పేయి ఒకరని తెలిపారు.
దేశం కోసం అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. విపక్షనేతలు సైతం ఆయనను మెచ్చుకునేవారన్నారు. వాజ్‌పేయి మృతి యావత్ దేశానికి తీరని లోటని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు రమేష్, రాజు నాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిని, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంత్‌కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, పార్టీ బంట్వారం మండల అధ్యక్షుడు రాచిరెడ్డి, వికారాబాద్ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా నాయకుడు అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment