గ్రీన్ హౌస్ కల్టివేషన్‌కూ సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ కల్టివేషన్ కింద రెండు వందల చదరపు మీటర్ల పరిధిలో పం టలు వేసుకున్న రైతులకు కూడా సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రూ.2.12 లక్షల ఖర్చులో రూ.1.59 లక్షల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, రైతులు కేవలం రూ.53 వేలు ఖర్చుపెట్టుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్లాంట్‌మెటీరియల్‌కు కూడా ప్రభుత్వం రూ.28 వేలు ఇస్తుందన్నారు.
బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గ్రీన్‌హౌస్ సాగు అభివృద్ధి, దీనికి గుర్తించిన ప్రాం తాలు, రైతులకు సబ్సిడీ తదితర అంశాలపై ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జి.సంజీవరావు, ఎం.అంజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పుట్టా మధుకర్ వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మూడెకరాల వరకు చిన్న, సన్నకారు రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రిజర్వేషన్‌తో ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు.