ప్రేమపేరుతో వేధిస్తే చర్యలు | Harassment activities with the name of love | Sakshi
Sakshi News home page

ప్రేమపేరుతో వేధిస్తే చర్యలు

Published Fri, Aug 28 2015 1:10 AM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

ప్రేమపేరుతో వేధిస్తే చర్యలు - Sakshi

ప్రేమపేరుతో వేధిస్తే చర్యలు

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : మైనర్లను ప్రేమపేరుతో పెళ్లిచేసుకుంటామని చెప్పినా, వారిని లైంగికంగా లోబర్చుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కామారం శ్రీనివాసులు ఈనెల 24న కిడ్నాప్ చేశాడంటూ తండ్రి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంటనే కేసు నమోదు చేయాలని రూరల్ సీఐ శ్రీనివాసులును ఆదేశించారు.

ప్రేమపేరుతో పెళ్లి చేసుకుంటామని మైనర్‌ను తీసుకెళ్లిన వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని, ఆ బాలిక తనకు ఇష్టముందని చెప్పినా అది చెల్లదని తెలిపారు. వారికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కృష్ణమూర్తి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement