కాంగ్రెస్కు ఎన్ని తలలు, నాలుకలున్నాయో ! | hareesh rao fired on congress leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు ఎన్ని తలలు, నాలుకలున్నాయో !

Published Wed, Aug 31 2016 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్కు ఎన్ని తలలు, నాలుకలున్నాయో ! - Sakshi

కాంగ్రెస్కు ఎన్ని తలలు, నాలుకలున్నాయో !

మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలలు, ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజ మెత్తారు. మంగళవారం మండలి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల్లో ఒక్కో విధంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేయడాన్ని తప్పుబట్టారు.

కాంగ్రెస్ నాయకుల బండారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా బయటపెడతామన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టులు కట్టకుండా నిద్రపోయి ఇప్పుడు తాము కడుతుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెండేళ్లుగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవుతున్నా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement