Uproar
-
లెగ్గింగ్స్ వేసుకొచ్చారని మైనర్స్‌పై దారుణం
కోలకతా: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మిషనరీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా లెగ్గింగ్స్ వేసుకున్నారనే సాకుతో మైనర్ బాలికల పట్ల పాఠశాల యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించింది. సోమవారం జరిగిన ఈ ఘటన బాలికల తల్లితండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 4-9 సంవత్సరాల వయసున్న బాలికలు లెగ్గింగ్స్ వేసుకొని స్కూలుకు వచ్చారు. దీంతో పాఠశాల డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్లు మైనర్ బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉష్టోగ్రతలు పడిపోయి, చలికి వణికిపోతున్నారన్న కనీస మానవత్వం కూడా లేకుండా..పిల్లలతో బలవంతంగా లెగ్గింగ్స్‌ను తీసి వేయించారు. రోజంతా అలాగే వుండేలా శిక్ష విధించారు. దీనిపై బాలికల తల్లదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరని అవమానకరమైన ఈ చర్య తమ మర్యాదకు భంగకరమని ఆవేదన చెందారు. అభశుభం తెలియని తమ ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడుతూ శాంతినికేతన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన బిడ్డ లెగ్గింగ్ లేకుండా పాఠశాల నుండి బయటకు రావడం చూసి షాకయ్యాననీ, పాపకు లోదుస్తులు కూడా లేవని బాధిత బాలిక తండ్రి ఒకరు వాపోయారు. ఇది చాలా దారుణమని పేర్కొన్న ఆయన హెడ్మిస్ట్రెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించి, తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అభిషేక్ రాయ్ అన్నారు. పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నామన్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించామంటూ తమ చర్యను సమర్ధించుకున్నారు. అయినా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పామనీ, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కాలేదనీ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ అర్చన ఫెర్నాండెజ్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అనన్య చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సంఘటన దారుణమైందని వ్యాఖ్యానించారు. విచారణ చేపడతామన్నారు. -
‘డబుల్’ రగడ
సాక్షి, ఖమ్మం అర్బన్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. తొలుత రఘునాధపాలెం మండలంలో పూర్తయిన 216 ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు నగరంలోని 2, 3, 4, 5, 6 డివిజన్లలోని పేదలకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆయా డివిజన్ల పరిధిలో దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో అర్హులైన వారిని గుర్తించి లాటరీ ద్వారా ఎంపికలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 2వ డివిజన్లో లబ్ధిదారుల ఎంపిక కోసం పాండురంగాపురం పాఠశాలలో తహశీల్దార్ శ్రీలత అధ్యక్షతన శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. అందిన దరఖాస్తులు, అర్హుల, అనర్హుల జాబితాలను పాఠశాలలో గోడలకు అతికించారు. వాటిని పరిశీలించుకున్న వారిలో తొలిగించిన జాబితాలో ఉన్న వారు అరుపులు, కేకలు, అగ్రహాలతో రెవెన్యూ అధికారులను నిలదీశారు. అద్దె ఇళ్లలో ఉంటూ, నిత్యం కూలీకి వెళ్తేనే పొట్టగడిచే తాము ఎందుకు అర్హులం కాదని ప్రశ్నించారు. దీంతో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు తొలిగింపులకు కారణం, మళ్లీ నిజమైన అర్హత ఉంటే వారి పేర్లు చేర్చడం వంటి ఘటనలతో పాఠశాలలో గందరగోళ వాతావరణం నెలకొంది. డివిజన్లో 700 మందిపైగా దరreఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు వారిలో 385 మందిని అర్హులుగా గుర్తించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి లాటరీ కార్యక్రమం కొనసాగించారు. తహశీల్దార్ శ్రీలత, డీటీ సురేష్‌బాబు, ఆర్ఐ రాజేష్, వీఆర్ఓ వెంకటేశ్వర్లు ఈ ప్రక్రియను కొనసాగించారు. సీఐ నాగేంద్రాచారి, ఎస్ఐలు రామారావు, మోహన్‌రావు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల వరకు లాటరీ ప్రక్రియ.. రాత్రి 7 గంటలకు వరకు లాటరీ ద్వారా 40 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశారు. వికలాంగులకు 2, ఎస్టీలకు 2, ఎస్సీలకు 7, మైనార్టీలకు 5, ఇతరులకు 24 రిజ్వరేషన్ ప్రకారం కేటాయించినట్లు తహశీల్దార్ తెలిపారు. మిగిలిన 385 మందిలో 40 పోగా మిగతా వాటిని కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. పేర్ల తొలగింపుపై అధికారులను ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు -
రాజ్యసభలో దుమ్ముదుమారం.. జైట్లీకి కోపం
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేసి ఉన్నట్లయితే కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేదని హెచ్చరించారు. గోవధ నిషేధం పేరిట ముస్లింలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయనే అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో నరేశ్ అగర్వాల్ జోక్యం చేసుకొని మాట్లాడుతూ మద్యం బ్రాండ్స్‌కు హిందూ దేవుళ్లు, దేవతలకు లింక్ పెడుతూ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో క్షమాపణ చెప్పించేందుకు పట్టుబట్టాయి. అయితే, స్పీకర్ కురియన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ ఎంపీకి తగదని మందలిస్తూ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడితో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నరేశ్ అగర్వాల్ చెప్పగానే వాటిని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయితే, సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన అగర్వాల్ రాముడి పేరిట ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అనే విషయాన్ని సభకు చెప్పాలని ప్రయత్నించానని అన్నారు. -
బెజవాడలో పవన కళ్యాణ్ పోస్టర్ల కలకలం
-
కాంగ్రెస్‌కు ఎన్ని తలలు, నాలుకలున్నాయో !
మంత్రి హరీశ్‌రావు ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలలు, ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజ మెత్తారు. మంగళవారం మండలి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల్లో ఒక్కో విధంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకుల బండారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా బయటపెడతామన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టులు కట్టకుండా నిద్రపోయి ఇప్పుడు తాము కడుతుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెండేళ్లుగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవుతున్నా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని దుయ్యబట్టారు. -
వరంగల్ ఆస్పత్రిలో ఇంజెక్షన్ కలకలం
-
అమ్మాయిలదే అల్లరెక్కువ
వాషింగ్టన్: తరగతి గదిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ అల్లరి చేస్తారని తాజా అధ్యయనంలో తేలింది. అల్లరి విషయంలో హైస్కూల్, కాలేజీ స్థాయిలో అబ్బాయిలదే పైచేయిగా కనిపించినా ప్రాథమికస్థాయిలో మాత్రం అమ్మాయిలదే అల్లరి ఎక్కువగా వినిపిస్తుందట. నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఒకేరకమైన భావోద్వేగాలు కలిగి ఉంటారని, అయితే వయసు పెరిగేకొద్దీ వారిలో కలిగే మార్పుల వల్ల అల్లరి స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుందని యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జయంతి ఓన్స్ అన్నారు. ఇక చదువులో రాణించడం, రాణించకపోవడం వెనుక ఆరోగ్యం, లింగవివక్ష ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. 59.4 శాతం విద్యాఫలితాలకు లింగవివక్షే కారణమవుతోందని, ఇది అనుకూలంగా, ప్రతికూలంగా ఉంటోందని జయంతి తెలిపారు. -
కేసీఆర్ కుటుంబమే బాగుపడింది
♦ పెరిగిన ధరలతో జనం ఇబ్బంది పడుతున్నారు.. ♦ ప్రజల గల్లా పెట్టే ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వ ♦ ఖజానా నిండిందని సంబరపడడం హాస్యాస్పదం ♦ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే సుస్థిర వృద్ధి సాధించింది తప్ప పేద ప్రజలు కాదని మాజీమంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ైరెతుల ఆత్మహత్యలు సాగుతున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రుణమాఫీ అమలు కావడంలేదు. నిత్యావసరాలు చిటపటలాడుతున్నాయి. ప్రజల గల్లా పెట్టే ఖాళీ అవుతుంటే... ప్రభుత్వ గల్లా పెట్టె నిండిందని సంబరపడడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో సబిత విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లలోనే తెలంగాణ భారీగా రాబడి సమకూర్చుకుందని, జాతీయ ఆర్థికవృద్ధి శాతాన్ని మించి పోయిందన్న కేసీఆర్ ప్రకటనను తీవ్రం గా ఖండించిన సబిత.. అప్పులు పుట్టక రైతాంగం అల్లాడుతుంటే కనీసం పరిహారం ఇవ్వాలనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నింగినంటిన కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలను నియంత్రించాలనే బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టడం మాని జనరంజక పాలనపై దృష్టి సారించాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు. -
'మాటల యుద్ధం తప్పదేమో'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం మరింత వాడివేడిగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు ప్రశ్నోత్తరాలు ఇతర వ్యవహారాలను రద్దు చేసి రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిపిన ప్రభుత్వం ప్రతిపక్షాల వాణిని పట్టించుకోలేదు. వారికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకుండానే సభను బుధవారం వాయిదా వేశారని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మరోపక్క, గురువారంనాటి సమావేశంలో ప్రశ్నోత్తరాలు ప్రారంభంకానున్నాయి. గంటన్నరపాటు ప్రశ్నోత్తర కార్యక్రమం ఉండనుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తుండగా ఇటు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాట్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ రంగంపై కూడా కొంత సమయం చర్చ జరగనుంది. ఇక వరంగల్‌లో ఎన్ కౌంటర్‌పై చర్చ చేపట్టాలని సీపీఐ, సీపీఎం వాయిదా తీర్మానంతో పట్టుబట్టనుంది. మరోపక్క, ప్రతిపక్షాలపై దాడులు, జిల్లాలో ప్రొటోకాల్ ఉల్లంఘన అంశంపైన కాంగ్రెస్ పార్టీ, జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ, ఎర్రబెల్లి దయాకర్ అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఉండొచ్చు. -
సోనియాకు కోపమొచ్చింది!
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ సభ్యుడొకరు తనపై చేసిన ఆరోపణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు! ఎప్పుడూ లేని విధంగా తన సీటు వద్ద నుంచి వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళన చేశా రు. ‘ఆయన ఏమన్నారు? ఏంటిది?’ అని స్పీకర్‌ను ఉద్దేశించి ఆవేశంగా అన్నారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులంతా ఆందోళన చేయడంతో సభ గంటపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. లలిత్‌మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న సమయంలో.. బీజేపీ ఎంపీ ఒకరు నల్లధనం విషయంలో సోనియాపై ఆరోపణ చేయడం దీనికి కారణమైంది. అయితే బీజేపీ సభ్యుడు ఏమన్నారో తనకు వినబడలేదని, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరి శీలిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా సోనియాతోపాటు కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బీజేపీ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. గొడవ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2.45 వరకువాయిదా వేశారు. తర్వాత సభ సమావేశమైన తర్వాత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎవరు ఎవరిపైనా ఆరోపణ చేసుకోవద్దని కోరారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. ఇదిలా ఉండ గా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యు లకు అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం రాత్రి విందును ఇచ్చారు. -
వెల్‌లోకి దూసుకెళ్లిన సోనియా.. సభ వాయిదా
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లలిత్ గేట్ వివాదంపై లోక్‌సభలోచర్చకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో చర్చ వాడి వేడిగా సాగింది. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు సహా సోనియా గాంధీ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు రావడంతో గందరగో్ళం చెలరేగింది. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను వాయిదా వేశారు. సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మల్లి ఖార్జున ఖర్గే తన విశ్వ రూపాన్ని చూపించారు. ప్రధాని నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. టీవీలు, రేడియోల్లో మాట్లాడుతారుగానీ చట్టసభలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వర్డ్ వార్ జరిగింది. దీంతో సోనియా సహా మిగిలిన ఎంపీలందరూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నినాదాలతో, ఆందోళనతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో 2.30 వరకు సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలో్ గందరగోళం కొనసాగుతోంది. విపక్షాల నిరసనలతో ఇప్పటికి రెండు సార్లువాయిదా పడింది. కాగా వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఈ విషయంపై మొండిగా వ్యవహరించిన కేంద్రం ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చింది. కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ సుమిత్ర మహాజన్ బుధవారం అంగీకరించారు. -
అటు ఆందోళనలు.. ఇటు బీజేపీ విప్
-
అటు ఆందోళనలు.. ఇటు బీజేపీ విప్
ఢిల్లీ: అనేక కీలక బిల్లులను ఆమోదించుకోవాల్సిన నేపథ్యంలో అధికార బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ రేపు కచ్చితంగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా లోక్‌సభలో వ్యాపం, లలిత్ గేట్ వివాదంలో విపక్షాల ఆందోళనతో రగడ మొదలైంది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. లలిత్ గేట్ వివాదంపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు వచ్చారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మూలంగా దేశంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీని మూలంగా ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సభ కార్యక్రమాలకు అడ్డు తగొలద్దని విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు ఆందోళన విరమించలేదు. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యుల ఆందోళన చల్లారలేదు. కళంకిత మంత్రులు రాజీనామా చేయాలంటూ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులతో స్పీకర్ కురియన్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో మధ్నాహ్నం 12.30 ని.లకు సభను వాయిదా వేశారు. -
ఆగని రచ్చ..కొనసాగుతున్న వాయిదాలు
న్యూఢిల్లీ: యధావిధిగానే సోమవారం పార్లమెంటు ఉభయ సభలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ముందుగా జార్ఖండ్ లోని దేవ్‌గఢ్ తొక్కిసలాటలో మృతులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాక్షించింది. కాగా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, వ్యాపం వివాదాల చిచ్చు రగులుతూనే ఉంది. అయిదు రోజులు సస్పెన్షన్ తరువాత కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు, నినాదాలతోనే సభకు హాజరయ్యారు. ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో తన నిరసనను కొనసాగించారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. లలిత్ మోదీ కుంభకోణంపై చర్చను చేపట్టాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని కోరింది. ఎంపీ మల్లి ఖార్జున ఖర్గే ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే దీన్ని తిరస్కరించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు సభ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై స్పీకర్ ఆల్ పార్టీ సమావేశం నిర్వహించాలని ములాయం కోరారు. సభలో ప్లకార్డులతో ఆందోళన చేయడం సరికాదని పదే పదే గుర్తు చేశారు. అయినా విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. లలిత్ గేట్ వివాదంపై కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. నిరసనకు దిగారు. సభ నిర్వహణకు సహకరించాలని ఉపాధ్యక్షుడు కురియన్ విజ్ఞప్తులను సభ్యులు లక్ష్యపెట్టలేదు. సభ్యుల నిరసనలు నినాదాల మధ్యే సభ ను కొనసాగించడానికి ప్రయత్నించారు దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో చివరికి మధ్యాహ్న 12 గంటలకు వాయిదా పడింది. -
ఆఖరి 4 రోజులైనా సాగనివ్వండి
సభను అడ్డుకోబోమని చెబితే.. సస్పెన్షన్ ఎత్తివేతకు సిద్ధమే: వెంకయ్య న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో వివరణ ఇచ్చారు కాబట్టి... కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ అనే వైఖరిని విడనాడి ఆఖరి నాలుగు రోజులైనా పార్లమెంటును సజావుగా సాగనివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. 25 మంది కాంగ్రెస్ ఎంపీలను ఐదురోజుల పాటు సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమనే విపక్షాల వాదనను తిప్పికొడుతూ... సస్పెన్షన్ ఎత్తివేతకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, కాంగ్రెస్ మాత్రం సభలోకి రావడానికి ఇష్టపడటం లేదన్నారు. సస్పెన్షన్‌ను ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డేగా సోనియా అభివర్ణించడంపై స్పందిస్తూ... ‘ఈ వర్షాకాల సమావేశాల్లో అసలు మంచిరోజులు ఉన్నాయా? దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు. ఇప్పటికైనా సోనియా గాంధీ, కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలి. మిగిలిన నాలుగు రోజుల సమావేశాలనైనా సజావుగా సాగనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. లోక్‌సభలో మూడింట రెండోంతుల మెజారిటీ ఉన్న అధికార కూటమిని ముఖ్యమైన బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాంగ్రెస్‌కు ఆనందదాయకమని, కాంగ్రెస్ వైఖరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. జులై 21న మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 13తో ముగియనున్నాయి. -
రాజ్యసభలో ఆగని రగడ.. వాయిదా
-
స్పీకర్ అనుమతితో సభలోకి రావచ్చు: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉభయసభల్లోనూ శుక్రవారం కూడా ప్రతిష్టంభన కొనసాగింది. విపక్షాల ఆందోళన, నినాదాలు యథావిధిగా కొనసాగాయి. సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. పసుపు రైతులకు కనీస మద్దతు ధర కావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రైతులదే ప్రథమ స్థానమని తెలిపారు. కనీస మద్దతు ధర లభించక తమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దీనికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే మరోసారి విపక్షసభ్యులు నినాదాలతో అడ్డుతగిలారు. నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ సజావుగా సాగడానికి సభ్యులు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యుల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది. సభ్యుల ఆందోళనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. సభ సజావుగా సాగేందుకు సస్పెండైన సభ్యులు హామీ ఇస్తే, సస్పెన్షన్ ఎత్తివేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీనికి స్పీకర్ అనుమతి తీసుకొని సభలోకి ప్రవేశించవచ్చని వెంకయ్య ప్రకటించారు. అటు పార్లమెటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వరుసగా నాలుగో రోజూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కొనసాగింది. కళంకిత మంత్రుల్ని తొలగించేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. మరోవైపు విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. -
మూడోరోజూ కొనసాగిన రగడ..వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల ప్రతిష్టంభన కొనసాగుతోంది. 25 మంది ఎంపీల సస్పెన్షన్‌పై గురువారం కూడా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతుగా నిలిచాయి. దీంతో విపక్షాల ఆందోళనతో వరుసగా మూడోరోజు కూడా సభలో రగడ కొనసాగింది. సభ ప్రారంభం కాగానే హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఉధంపూర్ టెర్రరిస్టు దాడి ఘటనకు సంబంధించి సభలో ఒక ప్రకటన చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు ఘనంగా నివాళుర్పించింది. ఉపాధ్యక్షుడు కురియన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగానే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పోడియం ముందుకు దూసుకొచ్చి సభను అడ్డుకున్నారు. చర్చకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ ను వాయిదా వేశారు. -
లోక్‌సభలో హోరాహోరీ
-
లోక్‌సభలో హోరాహోరీ
వరుసగా మూడో రోజూ పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగిం చనిదే ఎలాంటి చర్చనూ జరగనివ్వబోమని విపక్షాలు భీష్మించుకుంటే, కాంగ్రె స్ నేతలపై ప్రత్యారోపణలతో అధికారపక్షం ఎదురుదాడిని పెంచింది. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల అవినీతిని ప్రస్తావిస్తూ బీజేపీ సభ్యులు సైతం ప్లకార్డులను ప్రదర్శించారు. సోనియాఅల్లుడు రాబర్ట్‌వాద్రాపై బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేసింది.. ఆయనను సభ ముందుకు రప్పించి శిక్షించాలని డిమాండ్ చేసింది. రాజీనామాల డిమాండ్‌తో వెల్‌లో ప్రతిపక్షాల ఆందోళన * ప్రతిగా పోడియం వద్దకు దూసుకొచ్చిన బీజేపీ ఆందోళన * కాంగ్రెస్ ప్లకార్డులకు పోటీగా బీజేపీ ప్లకార్డుల ప్రదర్శన * రాబర్ట్‌వాద్రా సభా హక్కులు ఉల్లంఘించారంటూ ఆరోపణ * అధికార-విపక్షాల మధ్య యుద్ధవాతావరణం * మూడో రోజూ కొనసాగిన పార్లమెంటు ప్రతిష్టంభన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు గురువారం లోక్‌సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాల సభ్యులు ఆవేశాలతో ఊగిపోతూ సభను యుద్ధ క్షేత్రంగా తలపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ ఐదు నిమిషాలు కూడా కొనసాగని పరిస్థితి నెలకొంది. తొలుత స్పీకర్ సుమిత్రామహాజన్ వ్యాపమ్, ఐపీఎల్ స్కాంలు తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదాతీర్మానాలతో పాటు, టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రత్యేక హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానానికై ఇచ్చిన నోటీసును తిరస్కరించారు. ఈ సమయంలో యథావిధిగా కాంగ్రెస్ నే తృత్వంలోని పలు విపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టుకుని పోడియం వద్దకు దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార బీజేపీ సభ్యులు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ధరించి తమ స్థానాల నుంచి ముందుకు వచ్చారు.టీఆర్ఎస్ సభ్యులు కూడా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించినప్పటికీ.. కొన సాగే పరిస్థితి లేకపోవటంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన... తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా మునుపటి ఘట్టమే పునరావృతమైంది. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కూడా పోడియం సమీపంలోకి దూసుకొచ్చారు. వీరికి మద్దతుగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో నిలుచుని నినాదాలు చేశారు. రాబర్ట్ వాద్రాకు వ్యవసాయ భూములు కట్టబెట్టి మళ్లీ అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. కిసాన్ కా జమీన్ దామాద్ కో బాంటే..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై జవాబు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ‘బ్రష్టాచార్ కో జయ్ జయ్ కర్‌హై.. యే బేషరమ్ సర్కార్ హై..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీతో కలసి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తమ పార్టీ సభ్యులను వారి వారి స్థానాలకు వెళ్లేలా ఒప్పించారు. వాద్రాను సభ ముందుకు రప్పించాలి ఈ గందరగోళం మధ్యే బీజేపీ సభ్యుడు ప్రహ్లాద్‌జోషీ నిలుచుని.. రాబర్ట్ వాద్రా పార్లమెంటు సభ్యులనుఅగౌరవపరిచారని, ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని సభాహక్కుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని పట్టుపట్టారు. ‘‘వాద్రా కొద్ది రోజుల కిందట ఫేస్బుక్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, దానితో పాటే వారి దృష్టి మళ్లింపు రాజకీయ ఎత్తుగడలు మొదలవుతాయని, దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేయలేరని, దేశానికి ఇలాంటి నాయకులునేతృత్వం వహిస్తుండటం పట్ల చింతిస్తున్నానని.. వాద్రా వ్యాఖ్యానించారు. ఆయన పార్లమెంటులోని సభ్యులనే కాకుండా పార్లమెంటు మొత్తాన్నే కించపరిచారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చారు. అందువల్ల వాద్రాను తక్షణం సభకు పిలిపించి మందలించాలి. ఆయనకు శిక్ష పడాలి.’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తీవ్ర ఆగ్రహం తో తన స్థానం నుంచి లేచి నిల్చొని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు స్వరాన్ని పెంచుతూ తమ నినాదాలను మరింత ఉధృతం చేశారు. రాజ్యసభలో మారని పరిస్థితి... ఇక రాజ్యసభలోనూ కాంగ్రెస్‌తో పాటు, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను కొనసాగించాయి. విపక్ష సభ్యులు సుష్మా, రాజే, చౌహాన్‌ల రాజీనామా కోరుతూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ రెండుసార్లు వాయిదా పడింది. రెండు గంటల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. నన్ను మాట్లాడనివ్వండి: స్పీకర్ లోక్‌సభలో ఒక దశలో స్పీకర్ సుమిత్రా మహా జన్ లేచి ప్రకటన చేయబోతుండగా విపక్ష సభ్యులు ఏమాత్రం తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో..‘‘నన్ను మాట్లాడనివ్వండి. మీకు సభ నడవడం ఇష్టం లేకపోతే.. చర్చ జరగడం ఇష్టంలేకపోతే.. సభను వాయిదావేస్తాను...’’ అని పేర్కొన్నారు. దీనికి విపక్ష సభ్యులు ‘‘బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొస్తే మీరేం మాట్లాడరు. కానీ మాపై మీరు మాట్లాడతారు...’’అని వ్యాఖ్యానించారు. స్పీకర్ బదులిస్తూ.. ‘‘వారి గురించీమాట్లాడేందుకు మీరు అవకాశం ఇవ్వట్లేదు. నియమాలు రూపొం దించేది మీరే.. మీరే ఇలాచేస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. అయినా విపక్షాలు తగ్గలేదు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్ వద్దకు వెళ్లి, ‘రాబర్ట్‌వాద్రా ఈ సభలో సభ్యుడు కాదని, ఆయన పేరును ఎలా ప్రస్తావిస్తార’ని ప్రశ్నించారు. ఈ సందర్భంలో సభ అదుపు తప్పడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదావేశారు. మన్మోహన్, ఆజాద్‌లతో మోదీ కరచాలనం పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో పలువురు ప్రతిపక్ష నేతలను స్వయంగా కలసి పలకరించటం విశేషం. ప్రశ్నోత్తరాల సమయంలో ఎగువసభకు వచ్చిన మోదీ.. ప్రతిపక్ష స్థానం వైపు వెళ్లి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను పలకరించి, ఆయనతో కరచాలనం చేశారు. తర్వాత కొంచెం ముందుకెళ్లి ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్నూ పలకరించి, కరచాలనం చేశారు. కాంగ్రెస్ సభాపక్ష ఉపనేత ఆనంద్‌శర్మకు ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన కరణ్‌సింగ్‌తో కొద్ది క్షణాలు ముచ్చటించారు. జైరాంరమేశ్నూ పలకరించారు. వెనుదిరిగి వస్తూ సీపీఐ నేత డి.రాజాను పలకరించారు. ఆ తర్వాత తమ పార్టీ ఎంపీలను పలకరించిన మోదీ వారికి అభివాదం చేశారు. సుష్మ దిగిపోతేనే చర్చ: రాహుల్ లలిత్ వివాదంపై మౌనం వహిస్తున్న ప్రధాని మోదీ విశ్వసనీయత దిగజారుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రధాని నుంచి సమాధానాలు డిమాండ్ చేస్తున్న దేశ ప్రజల గొంతును మోదీ వినాలని వ్యాఖ్యానించారు. లలిత్‌గేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆ పదవి నుంచి తప్పుకునే వరకూ.. ఆ అంశంపై పార్లమెంటులో చర్చకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన ఉద్ఘాటించారు. రాహుల్ గురువారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజీనామా లేనిదే చర్చ ఉండదని మేం చెప్పాం. సుష్మా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ’’ అని రాహుల్ ఆరోపించారు. కాగా తమ తమ వ్యూహానికి మద్దతుగా ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ సమీకరిస్తోంది. రాహుల్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేలు గురువారం ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, జేఎంఎం నేత విజయ్ హాన్స్దక్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవత్మన్లను కలిసి చర్చించారు. జైట్లీ అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ నై పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు మార్గాన్వేషణలో భాగంగా రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించటానికి పిలుపునిచ్చారు. అయితే.. ఈ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ఆ ప్రయత్నాన్ని జైట్లీ విరమించుకున్నారు. సమావేశంలో పరిష్కారం లభించదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగిస్తేనే పరిష్కారమవుతుందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. రాజీనామాల అంశంపై విపక్షాల మధ్య ఐక్యత లేదన్న వాదనలను ఆయన కొట్టివేశారు. ఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, జేడీయూ పార్టీలన్నీ.. లలిత్‌మోదీ, వ్యాపమ్ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. -
ఉభయ సభల్లో యుద్ధ వాతావరణం
-
ల్యాండ్ బిల్లుపై రగడ.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల మొదటిరోజు లోకసభలో భూసేకరణ చట్టం - 2013 సవరణల బిల్లును సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. కేంద్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఈ ఆర్డినెన్సును సభలో ప్రవేశపెడుతున్నపుడు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కిసాన్ బచావో, దేశ్ బచావో అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ నేత ములాయంసింగ్ తదితర నేతలు ఆందోళనకు దిగారు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఈ బిల్లును రద్దు చేయాలని కోరుతూ కొంతమంది నేతలు వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చామని తెలిపారు. భారతీయులతో పాటు విదేశీయులను కూడా యెమెన్ నుంచి సురక్షితంగా తరలించామని వెల్లడించారు. లోకసభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించింది. ఎన్డీఏ ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేదిగా ఉందని... ఈ బిల్లును అడ్డుకొని తీరతామంటోంది కాంగ్రెస్. -
సభలో క్షమాపణ రచ్చ
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. ‘క్షమాపణ’ అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.. ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకొని క్షమాపణ చెప్పాలని సొంత పార్టీ సభ్యుడికే సూచించడం వంటి పరిణామాలతో శాసనసభలో హైడ్రామా చోటు చేసుకుంది. నాలుగుసార్లు మైక్ కట్ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. అయితే క్షమాపణ అంశాన్ని పక్కనబెట్టి.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై సంపత్ చురకలంటించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ చూపిన వీడియో ఫుటేజీ స్పష్టంగా లేదని కూడా ఆయన చెప్పారు. దీంతో క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. జానారెడ్డి జోక్యం చేసుకుని తమ సభ్యుడు క్షమాపణ చెప్పేందుకు అవకాశమివ్వాలని కోరడంతో స్పీకర్ మళ్లీ అవకాశమిచ్చారు. సంపత్ మళ్లీ అధికార పార్టీ సభ్యులపై ధ్వజమెత్తారు. దీనికి టీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. తిరిగి అవకాశం ఇచ్చినప్పుడు సంపత్ మాట్లాడుతూ ‘సభ ఆర్డర్లో లేని పరిస్థితుల్లో జాతీయ గీతాలాపన మొదలుపెట్టారు. ఈ విషయంలో ఒకరికి ఒక నీతి, మరొకరికి ఇంకో నీతి ఉండకూడదు. అవమానపరిచే రీతిలో వ్యవహరించిన అందరితో క్షమాపణ చెప్పించండి’ అన్నారు. క్షమాపణ చెప్పకపోవడంతో మంత్రి హరీష్‌రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆహ్వానిస్తామని మంత్రి అన్నారు. అనంతరం సంపత్‌కు తిరిగి స్పీకర్ మైకివ్వగా, ఎవరో చెప్పింది చెప్పేందుకు సభకు రాలేదని ఆయన అనడంతో సభలో మళ్లీ గందరగోళం రేగింది. క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ నేతలు నినాదాలు చేస్తుండటం, సంపత్ క్షమాపణ చెప్పకపోవడంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. దీంతో మంత్రి హరీష్ లేచి సభ్యుడు క్షమాపణ చెప్పనందున సస్పెన్షన్ ప్రతిపాదన చేయబోయారు. ఈ దశలో మరోమారు కల్పిం చుకున్న జానారెడ్డి.. క్షమాపణకే పరిమితం కావాలని సంపత్‌కు సూచించారు. దీంతో మళ్లీ లేచిన సంపత్ ‘జరిగిన సంఘటనకు చింతి స్తున్నా. బాధపడుతున్నా. క్షమించాలని కోరుతున్నా’ అనీ అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. విద్యా సంస్థల్లో గీతాలాపన అంశం ప్రస్తావన కాగా, కొందరు ప్రజా ప్రతినిధులు తమ విద్యా సంస్థల్లో జాతీయగీతాలాపన చేయడం లేదని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు ఇప్పుడు జాతీయ గీతాన్ని అవమానిస్తారా అని మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. సంపత్ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ అక్బరుద్దీన్ స్పందించిన తీరును సభ్యులు ఆసక్తిగా గమనించారు. విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయకుండా ఆంక్షలు పెట్టిన వారెవరో బయటపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ‘ఇది చాలా తీవ్ర అంశం. దీన్ని అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకోవాలి. వారి వారి సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయని వారిని కఠినంగా శిక్షించాలి. దేశంలో ఉంటూ, ఇక్కడి ఉప్పు తింటూ జాతీయ గీతాలాపన చేయకపోవడం దారుణం. అలాంటి వారు దేశం బయట ఉండాలి’ అన్నారు. జాతీయ గీతాన్ని ఎవరు అగౌరవ పరిచినా కేవలం క్షమాపణతో సరిపోదని, వారిపై కఠిన చర్యలుండాలన్నారు. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశమని, ఈ విషయంలో మెతక వైఖరి మంచిది కాదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. -
మత మార్పిళ్లపై దద్దరిల్లిన రాజ్యసభ
న్యూఢిల్లీ : మత మార్పిడి అంశంపై రాజ్యసభ సోమవారం కూడా అట్టుడికింది. బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు మత మార్పిడి బిల్లుపై చర్చకు పట్టుపట్టారు. ఛైర్మన్ పొడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు. మత మార్పిడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత సభ ప్రారంభంకాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఛైర్మన్ తిరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. -
పింఛన్లపై కేసీఆర్ తీరు సరికాదు
ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజం భోలక్‌పూర్: ‘మీ ఇంట్లో ఏకంగా నాలుగు పదవులుండవచ్చు కానీ, సామాన్య పేద ప్రజల ఇళ్లల్లో ఒక్కరికే పింఛన్ ఇస్తాంటారా..ఇది మీ దురంహకారానికి నిదర్శనం’ అని సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజాడీలక్స్ థీయేటర్ ఎదురుగా ముషీరాబాద్ ప్రధాన రోడ్డు పక్కన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆరు నెలల పాలనలో ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బతుకమ్మ ఆట తెలవని వారుండరు కానీ, మగ అధికారులతో బతుకమ్మలను ఆడించిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత మంది ఇతర పార్టీల్లోకి వెళ్లినా నష్టంలేదన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, భోలక్‌పూర్ కార్పొరేటర్ వాజిద్‌హుస్సేన్, రాంనగర్ కార్పొరేటర్ కల్పనా, బాగ్‌లింగంపల్లి కార్పొరేటర్ ప్రభాకర్‌రెడ్డి, సెట్విన్ చైర్మన్ మక్సూద్, నాయకులు డాక్టర్.వినయ్,టి.రాజేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, కేఆర్కె.ప్రసాద్, కేశవ్, అంజిరెడ్డి, పూస శ్రీకృష్ణ, ఎం.ఆర్.దశరథ్, ఐడీఎల్ సత్యనారాయణ, నగేష్ ముదిరాజ్, లక్ష్మీబాయి, సుభద్ర, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు