మత మార్పిడి అంశంపై రాజ్యసభ సోమవారం కూడా అట్టుడికింది. బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది.
న్యూఢిల్లీ : మత మార్పిడి అంశంపై రాజ్యసభ సోమవారం కూడా అట్టుడికింది. బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు మత మార్పిడి బిల్లుపై చర్చకు పట్టుపట్టారు. ఛైర్మన్ పొడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు.
మత మార్పిడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత సభ ప్రారంభంకాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఛైర్మన్ తిరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.