మరింత సమర్థంగా పనిచేయండి
ఇంజనీర్లకు హరీశ్ సూచన
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్స రంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ 2017 క్యాలెండర్‌ను శనివారం తన చాంబర్లో ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు... అనంతరం వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.భక్తరామదాసు, సీతారామ, కాళేశ్వరం, దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్పీ , మిడ్‌మానేరు, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా పథకాల పురోగతిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సాగునీటి ప్రాజె క్టుల విషయంలో అనుకున్న లక్ష్యాలను సాధించవలసిందేనని స్పష్టం చేశారు. సీతా రామ ప్రాజెక్టు పూర్త యితే ఖమ్మం జిల్లాలో కరవు పరిస్థితులకు చెక్ పడుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లో అమ లు చేస్తున్న ’టేల్ టు హెడ్’ విధానంలో సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనా ల్‌ల కింద అమలు చేయాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా కోరారు. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందుతుం దన్నారు. వివిధ ప్రాజెక్టుల కింద భూసే కరణ ప్రక్రియ, పనుల పురోగతిని అధికా రులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.