Sita Rama Project
-
సీతారామకు 67.05 టీఎంసీల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడానికి అను మతిస్తూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ క్లియరెన్స్ జారీ చేసిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు అనుమతులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని విజయం సాధించిందన్నారు.ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు పంప్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. మంగళవారం ఆయన జలసౌధలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు కేవలం రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, కమీషన్లు, పర్సెంటేజీల కక్కుర్తితో రీఇంజనీరింగ్ చేపట్టి రెండు ప్రాజెక్టులను సమీకృతం చేసి సీతారామ ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు.ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,286 కోట్లకు పెంచి ఐదింతలు చేసిందని మండిపడ్డారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల ద్వారా 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదని, సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయం ఐదింతలు పెంచినా ఆయకట్టు 3.29లక్షల ఎకరాలకు తగ్గిందన్నారు. పంప్‌హౌస్‌ల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని 349 మెగావాట్ల నుంచి 694 మెగావాట్లకు, సేకరించాల్సిన భూములను 2,482 ఎకరాల నుంచి 3,656 ఎకరాలకు పెంచడంతో ఆర్థికభారం పెరిగినా ఒక్క ఎకరా ఆయకట్టు పెరగలేదని విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టుపై రూ.7,436 కోట్ల వ్యయంతో 39శాతం పనులను మాత్రమే పూర్తి చేసిందని, 90శాతం పనులు పూర్తిచేశామని హరీశ్‌రావు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినట్టు హరీశ్ చెప్పుకోవడంలో వాస్తవం లేదన్నారు. ప్రాజెక్టు వ్యయ అంచనాలు, బెనిఫిట్ కాస్ట్ రేషియోలకు సైతం తామే అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు.సీతారామ ప్రాజెక్టు పనులను 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. త్వరలో జరగనున్న గోదావరిబోర్డు సమావేశంలో ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే..తదుపరి సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) అనుమతి కోసం డీపీఆర్ వెళుతుందని, దీంతో ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్టేనని ప్రకటించారు. కమీషన్లు వచ్చే పనులే చేశారు : పొంగులేటి హరీశ్‌రావు చెప్పుకున్నట్టు సీతారామ ప్రాజెక్టు మోటార్లను బీఆర్ఎస్ ప్రభుత్వమే బిగించిందని, మోటార్లకు ఎక్కువ కమీ షన్లు, లాభాలు వస్తాయనే ఆ పనులు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రూ.430 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు మోటార్ల డ్రై రన్ నిర్వహించలేదన్నారు. ఖమ్మం జిల్లాపై ఎంత ప్రేమ ఒలకబోసినా జిల్లా ప్రజలు బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మరని స్పష్టం చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆ పారీ్టకి జిల్లా ప్రజలు ఒకటే సీటు ఇచ్చారని, ఇకపై ఆ ఒక్క సీటు ఇవ్వబోరని తెలిపారు.నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనులను దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 75% పూర్తి చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ తామే చేసినట్టు పత్రికల్లో యాడ్స్ జారీ చేసిందన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల అవసరాలకు సాగర్ టెయిల్‌పాండ్‌లోకి గోదావరి నీళ్లను ఎత్తిపోయాలని వైఎస్ ప్రభుత్వం నాడే నిర్ణయం తీసుకుందని, దీనిని కొత్తగా హరీశ్‌రావు సూచించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు,సీతారామ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్.. అని రెండు వేర్వేరుగా ఉండేవని. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు మరో 1,400 కోట్లు ఖర్చు చేస్తే దుమ్ముగూడ, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తయ్యేవని కేసీఆర్ చెప్పినట్లు గుర్తిచేశారు. అయితే పదేళ్లు అయినా అవి పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పూర్తయితే 3 లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్ళు అప్పుడే వచ్చేదని... కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ రూ. 1,681కోట్ల ప్రాజెక్టు మాత్రమేనని.. 2014 నాటికి 7వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు అని తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ రెండు ప్రాజెక్టులు రూ. 1552 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేవని అన్నారు. 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేమని పేర్కొన్నారు. వీటిని రీడిజైన్ చేసి.. రెండు ప్రాజెక్టులు కలిపి సీతారామ అని పేరు పెట్టి 18వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రూ.7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారని మండిపడ్డారు. 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ను 22 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే 9 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇంతటి దోపిడి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజలు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడి చూస్తుంటే కడుపు తరుక్కుపోతోదన్నారు. -
‘సీతారామ’ డీపీఆర్‌ను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై అంచనా వేసి, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా ట్రిబ్యునల్ పంపిణీ చేసేవరకు తెలంగాణ సర్కార్ సమర్పించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని కేంద్రం, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లకు గురువారం రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చినప్పుడు నీటిలభ్యతను అధికంగా చూపించారని, దానిపై తమ అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం, గోదావరి డెల్టాకు నీటిలభ్యత తగ్గుతుందని, ఆ ప్రాజెక్టును ఆమోదిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందని స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిన గోదావరి బోర్డు.. అక్టోబర్ 6లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై అభిప్రాయాలను చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో కొన్ని ప్రధానాంశాలు.. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిలో 991.19 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో వ్యాప్కోస్ లెక్కగట్టింది. పోలవరం వద్ద 460.36 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వద్ద 315.54 టీఎంసీలే మిగులు ఉంటుంది. ► పోలవరం వద్దకు సగటున 561 టీఎంసీల ప్రవాహం వస్తుందని లెక్కకట్టిన సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు 2006 సెప్టెంబర్ 12న హైడ్రాలాజి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ పోలవరం వద్ద నీటిలభ్యత 460.36 టీఎంసీలే ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో ఉండటంపై 2018లోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. 2018లో 32 టీఎంసీల సామర్థ్యంతో డీపీఆర్ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పోలవరం, గోదావరి డెల్టాలకు తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది. ► పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా అవసరాలు 554.81 టీఎంఎసీలు. పోలవరం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిన సమయంలో పోలవరం ప్రాజెక్టులో 34.92 టీఎంసీల ఆవిరి నష్టాలు ఉంటాయని తేల్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువల అదనపు అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, ముసురుమిల్లి, వెంకటనగరం, భూపతిపాలెం, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, మాచ్‌ఖండ్ తదితర ప్రాజెక్టుల అవసరాలు లెక్కిస్తే.. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత కింద రాష్ట్ర వాటా 775 టీఎంసీలు. ► ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరి 15న కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అంచనా వేయించాలి. ఎగువ రాష్ట్రాలు పూర్తిచేసిన, నిర్మాణంలో ఉన్న, చేపట్టనున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులు చేయాలి. ఆ తర్వాతే డీపీఆర్‌లను ఆమోదించాలి. -
‘సీతారామ’ను పర్యవేక్షించాలి
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రి పువ్వాడకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు కేటాయించిన నిధులు, పనుల వివరాల గురించి మంత్రిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం వస్తుందన్నారు. 6.20 లక్షల ఎకరాలను గోదావరి జలాలతో తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆయా బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. మంత్రి వెంట సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్ ఉన్నారు. -
‘పాలమూరు, సీతారామ’కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ భూముల బదలాయింపున కు అంగీకరించింది. దీనికి సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. సీతారామ ఎత్తిపోతలకు గత నెలలో చెన్నై ప్రాంతీయ కార్యాలయం అట వీ అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూ డెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని 330 హెక్టార్లు.. మొత్తం 1,531 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు బద లాయిస్తూ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణ యం తీసుకుంది. ఇక పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్ లోని 205.48 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు అప్పగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, ఇటీవలే తుది దశ అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రాజెక్టులో భాగంగా నిర్మి స్తున్న మొదటి స్టేజి పంప్ హౌస్, నార్లపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్, నార్లపూర్ –అంజనగిరి – ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ల మధ్య టన్నెల్ తవ్వకపు పనులకు అటవీ భూములను బదిలీచేస్తూ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అనుమతితో 205.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు సీఈ ఆధీనంలోకి వస్తుంది. -
సీతారామను ప్రాజెక్టుగా గుర్తించండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టిన సీతారామ ఎత్తిపోతలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగానే గుర్తించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విన్నవించారు. ఈ మేరకు శనివారం గడ్కరీకి లేఖ అందించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని సమాచారం. -
మరింత సమర్థంగా పనిచేయండి
ఇంజనీర్లకు హరీశ్ సూచన సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్స రంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ 2017 క్యాలెండర్‌ను శనివారం తన చాంబర్లో ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు... అనంతరం వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.భక్తరామదాసు, సీతారామ, కాళేశ్వరం, దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ , మిడ్‌మానేరు, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా పథకాల పురోగతిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజె క్టుల విషయంలో అనుకున్న లక్ష్యాలను సాధించవలసిందేనని స్పష్టం చేశారు. సీతా రామ ప్రాజెక్టు పూర్త యితే ఖమ్మం జిల్లాలో కరవు పరిస్థితులకు చెక్ పడుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లో అమ లు చేస్తున్న ’టేల్ టు హెడ్’ విధానంలో సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనా ల్ల కింద అమలు చేయాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా కోరారు. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందుతుం దన్నారు. వివిధ ప్రాజెక్టుల కింద భూసే కరణ ప్రక్రియ, పనుల పురోగతిని అధికా రులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.