స్వచ్ఛ హైదరాబాద్ పై మంత్రి హరీష్‌రావు సమీక్ష
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సమస్యలపై మంత్రి హరీష్‌రావు సంబంధిత అధికారులతో బుధవారం బంజారాహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ట్రాన్స్‌కో, పోలీస్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో చేపట్టిన పనుల్లో 50 శాతం పూర్తి చేశామని, మిగతా పనులను వచ్చే నెల మొదటి వారానికి పూర్తిచేస్తామని చెప్పారు. రూ.8 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 78 మందికి పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. కాగా, కొన్నిచోట్ల పనులు కాకపోవడం పట్ల మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాటర్ వర్క్స్ అధికారుల తీరుపై మండిపడ్డారు.