హైదరాబాద్‌కు ఆపండి.. సంగారెడ్డికి ఇవ్వండి
అవసరమైతే బోర్లు వేయండి తాగునీటి సమస్యపై
మంత్రి హరీశ్‌రావు సమీక్ష
సంగారెడ్డి క్రైం: జిల్లాలో మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో తాగునీటి సమస్యపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైతే నీటి సమస్య ఉత్పన్నమవుతుందో అక్కడ బోర్లు వేసి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మంజీర నుంచి మంచినీటిని అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంజీర నుంచి హైదరాబాద్‌కు మంచినీటిని ఇవ్వడం జరుగుతుందని, దాన్ని ఈనెల 29తో ఆపివేసి సంగారెడ్డి పట్టణ వాసులకు నీరందించాలని చెప్పారు.
పరిశ్రమలకు ఇచ్చే నీటిని వెంటనే నిలిపివేయాలని, అలాగే మంజీరాలో ఉన్న వ్యవసాయ బోర్లను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్, గూడూరు, షాపూర్, బోరంచ, కంగ్టి, కొండాపూర్‌లలో గల సమగ్ర మంచినీటి పథకాల ద్వారా మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామానికి నీరందించే విధంగా చూడాలన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్దేశించిన సమయంలోగా ఈ మంచినీటి పథకాలను పర్యవేక్షించి అవసరమైన చోట్ల బోర్లను వేయాలని సూచించారు.
మంజీర నీరు గేట్ల ద్వారా ప్రవహించేందుకు సరిపోకపోతే సబ్‌మెర్సబుల్ పంపులను డ్రిల్ చేసి రిజర్వాయర్‌ను నింపి, సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మంచినీటిని సరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈనెల 25న ఉదయం మంజీరా డ్యాంను సందర్శించడం జరుగుతుందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెసి వెంకట్‌రాంరెడ్డి, వాటర్ గ్రిడ్ ఎస్.ఇ.విజయప్రకాష్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ మధు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రాములు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
నీటి సమస్య తలెత్తొద్దు
Published Mon, Nov 23 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement