
ఖరీఫ్ నాటికి సాగు నీరందించేలా ప్రణాళిక
ఎల్లంపల్లి, మిడ్‌మానేరుపై మంత్రి హరీశ్ సమీక్ష
భూ సేకరణ సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఏడా ది జూన్‌లో ఖరీఫ్ నాటికి సాగు నీరు అం దించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ, సహాయ, పునరావాస సమస్యలపై హరీశ్ శనివారం హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, బొడిగె శోభ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్ సీ మురళీధర్‌రావు, కరీంనగర్ సీఈ అనిల్‌కుమార్, ఎస్‌ఈ ఎన్.వెంకటేశ్వర్లు సమీక్షలో పాల్గొన్నారు.
వచ్చే ఖరీఫ్‌లో చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో లక్ష చొప్పునఎకరాలకు సాగు నీరు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వేములవా డ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి మండలాల పరిధిలో 44 వేల ఎకరాలకు రూ. 230 కోట్లతో సాగు నీరు అందించేలా పూర్తి స్థాయి నివేదిక(డీపీఆర్) సిద్ధం చేయాలన్నారు. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో భూ సేకరణ సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించి.. అవసరమైన చోట జీవో123 నిబంధనల మేరకు సేకరణ జరపాలన్నారు.
చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లి, గుండెనపల్లి, కోనాపూర్ గ్రామాలను ముంపు నుంచి తప్పించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు ముంపు సమస్యపై మంత్రికి విన్నవించారు. మిగ తా గ్రామాల్లో భూ సేకరణ ధరపై రైతుల తో ప్రాథమికంగా చర్చ జరిగిందని, త్వర లో జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు. కాగా.. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజక్టు ముంపు గ్రామాల్లో ఇళ్లు, ఇతర కట్టడాల విలువను వేగంగా మదింపు జరపాలన్నారు.
వేములవాడ నియోజకవర్గంలో...
వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి మండలంలో సేకరించిన 314ఎకరాల భూ మికి వెంటనే చెల్లింపులు జరపాలన్నారు. భూ సేకరణ వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. మిడ్‌మానేరులో ముంపునకు గురవుతున్న సం కేపల్లి సమస్యలను పరిశీలించడానికి కమి టీ ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు చేపట్టి న కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.