గత చరిత్ర చూసుకోవద్దా? | harish rao takes on congress and tdp | Sakshi
Sakshi News home page

గత చరిత్ర చూసుకోవద్దా?

Published Fri, Oct 10 2014 1:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

harish rao takes on congress and tdp

కాంగ్రెస్, టీడీపీలపై  మంత్రి హరీశ్ గుస్సా


 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు గత చరిత్రను చూసుకుని మాట్లాడాలని ఆ పార్టీ నేతలకు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖలమంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. గురువారం మంత్రి హరీశ్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుల సమక్షంలో  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల నేతలు టీఆర్‌ఎస్‌లో  చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీలే కరెంటు కష్టాలకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండుపార్టీలు ఆరిపోయే దీపాల్లాంటివన్నారు. నేడోరేపో ఆరిపోయే దీపాలను నమ్ముకుంటే చీకట్లు తప్పవన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఆ పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించే ముందు ఆ పార్టీల గత చరిత్రను చూడాలని హితవు పలికారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement