
'టీఆర్ఎస్ ను చీల్చేందుకు హరీశ్ కుట్ర'
గతంలోనే టీఆర్ఎస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హారీశ్ రావు సిద్ధమయ్యారని, దానికి ఈటెల రాజేందర్ సాక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో జేబు దొంగలు, చిల్లర దొంగలు ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడడం టైంవేస్ట్ అని మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతుతూ అన్నారు.
గతంలోనే టీఆర్ఎస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హారీశ్ రావు సిద్ధమయ్యారని, దానికి ఈటెల రాజేందర్ సాక్ష్యమని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు హరీశ్ రావు సిద్ధమైతే టీడీపీ మద్ధతు ఇవ్వాలా, లేదా అనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.