గల్ఫ్ వెళ్లే బాధ తప్పిస్తాం ఎంపీ కవిత హామీ
బాల్కొండ : నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం ఆమె వన్నెల్(బి)లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గల్ఫ్ బాట పడుతున్నారన్నారు. అక్కడా సరైన అవకాశాలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడారి దేశా ల్లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏడాదిలో 72 మంది మృతదేహాలను ప్రభుత్వం స్వదేశానికి తెప్పించిందన్నారు. నిరుద్యోగులు ఎడారి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశా లు కల్పిస్తామన్నారు. బాల్కొండలో పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి చూపుతామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో సరైన వివరాలు అందించని వారికే జీవన భృతి అందడం లేదన్నారు. జిల్లాలో 1,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 500 మంది టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
త్వరలో పసుపుపార్కు పనులు..
వేల్పూర్ : వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద త్వరలో పసుపు పార్కు పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కవిత తెలిపారు. బుధవారం ఆమె అంక్సాపూర్ నుంచి వన్నెల్(బి) వరకు రూ. 4 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంక్సాపూర్‌లో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పసుపు పార్కు మంజూరు చేయించానన్నారు. మామిడిపల్లి నుంచి నిజామాబాద్ వరకు ైరె ల్వేలైన్ నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 140 కోట్లు మంజూరు చేయించానని, పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు.
జిల్లా లో పసుపుబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. లక్ష మందికిపైగా బీడీ కార్మికులకు ఇప్పటికే జీవనభృతి అందుతోందని ఎంపీ తెలిపారు. అర్హులందరికీ జీవనభృతి అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆర్డీవో యాదిరెడ్డి, ఎంపీపీ రజిత బాల్‌రాజ్, జడ్పీటీసీ సభ్యురాలు విమల హన్మంత్‌రావు, అంక్సాపూర్ సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ పెద్ద ఇస్తారి, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, నాయకులు దేగాం రాములు, మహీపాల్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
Published Thu, Jun 11 2015 4:41 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement
Advertisement