జిల్లాల్లో భారీ వర్షం
నిడమనూరులో 17.3 సెం.మీ వర్షపాతం
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇదే జిల్లా చండూరు మండలంలో 12.4 సెం.మీ, నార్కట్‌పల్లిలో 8.8, చింతపల్లిలో 7.3, శాలి గౌరారంలో 7.1 సెం.మీ వర్షం పడింది. ఈ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచి పోయాయి. సూర్యా పేట జిల్లాలోని హుజుర్‌నగర్‌లో 6.4 సెం. మీ, తుంగతుర్తిలో 5.2, మేళ్లచెరువులో 5.0, మఠంపల్లిలో 4.2 గరిడేపల్లిలో 4.0 సెం.మీ వర్షం కురిసింది. హుజూర్‌నగర్ నుంచి మఠం పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై చింతబావి వాగు ఉధృతంగా ప్రవహించింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాపూర్ మండలం ఊరచెరువు మత్తడి పొంగుతోంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయ మయ్యాయి. పాకాల సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరింది.
పాక్షికంగా ఆలయం ధ్వంసం
వరంగల్ అర్భన్ జిల్లా కాజీపేట కడిపికొండలో పిడుగుపాటుకు బ్రహ్మంగారి ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఆంజనే యస్వామి విగ్రహంతోపాటు, గోపురం స్వల్పంగా ధ్వం సమైంది. కుమ్రంభీం జిల్లా రెబ్బెన మండలం కైర్‌గాంలో రైతు నామని పోచయ్య పిడుగు పాటుకు మృతి చెందాడు.