Bombshell
-
జిల్లాల్లో భారీ వర్షం
నిడమనూరులో 17.3 సెం.మీ వర్షపాతం సాక్షి నెట్వర్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇదే జిల్లా చండూరు మండలంలో 12.4 సెం.మీ, నార్కట్‌పల్లిలో 8.8, చింతపల్లిలో 7.3, శాలి గౌరారంలో 7.1 సెం.మీ వర్షం పడింది. ఈ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచి పోయాయి. సూర్యా పేట జిల్లాలోని హుజుర్నగర్లో 6.4 సెం. మీ, తుంగతుర్తిలో 5.2, మేళ్లచెరువులో 5.0, మఠంపల్లిలో 4.2 గరిడేపల్లిలో 4.0 సెం.మీ వర్షం కురిసింది. హుజూర్నగర్ నుంచి మఠం పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై చింతబావి వాగు ఉధృతంగా ప్రవహించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాపూర్ మండలం ఊరచెరువు మత్తడి పొంగుతోంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయ మయ్యాయి. పాకాల సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరింది. పాక్షికంగా ఆలయం ధ్వంసం వరంగల్ అర్భన్ జిల్లా కాజీపేట కడిపికొండలో పిడుగుపాటుకు బ్రహ్మంగారి ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఆంజనే యస్వామి విగ్రహంతోపాటు, గోపురం స్వల్పంగా ధ్వం సమైంది. కుమ్రంభీం జిల్లా రెబ్బెన మండలం కైర్‌గాంలో రైతు నామని పోచయ్య పిడుగు పాటుకు మృతి చెందాడు. -
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం
♦ షాబాద్ మండలం నాగరగూడలో బాలుడు.. ♦ శంషాబాద్ మండలం కవ్వగూడలో మహిళ.. ♦ తొండుపల్లిలో రెండు.. ఘాంసిమియాగూడ, నాగిరెడ్డిపల్లిలో ♦ ఒక గేదె, మన్సాన్పల్లిలో ఐదు మేకలు మృతి ♦ సిరిగిరిపల్లిలో కోళ్లఫాం కూలి రెండువేల కోళ్లు మృత్యువాత ♦ మహేశ్వరం మండలం సిరిగిరిపురంలో ♦ వర్షానికి కూలిన గోడ.. ఒకరి మృతి కవ్వగూడ(శంషాబాద్ రూరల్): పిడుగుపాటుతో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కూలీకి వచ్చిన మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రొడ్డ పెంటయ్య, భార్గవి(28) దంపతులు తమకున్న అరెకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. వీరికి పిల్లలు మణిరాం(5), శ్రీనాథ్(3) ఉన్నారు. పొలంలో బెండకాయ, సొరకాయ, ఆకుకూర సాగు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గొడుగు గోపాల్ కూతురు సంధ్య(19) మంగళవారం వీరి పొలంలోకి కూలీకి వచ్చింది. భార్గవి, సంధ్య సొరకాయ పంటలో కలుపు తీస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. దీంతో వీరిద్దరూ సమీపంలో ఉన్న ఓ మేడిచెట్టు కిందికి చేరుకున్నారు. అదే సమయంలో పిడుగుపడడంతో భార్గవి, సంధ్య స్పృహ కోల్పోయారు. సమీపంలోని పొలాల్లో ఉన్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామం నుంచి భార్గవి భర్త పెంటయ్య, మాజీ ఎంపీటీసీ మైసయ్యతోపాటు స్థానికులు ఆటోలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్గవి అప్పటికే మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సంధ్యను ఆటోలో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటి వరకు పొలంలో హుషారుగా పని చేసిన ఆమె దుర్మరణం చెందడంతో భర్త కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రైతులపై నీటి తీరువా ‘పిడుగు’
పెంపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ * త్వరలో ఉత్తర్వులు జారీ * రూ.631.56 కోట్ల ఆదాయం లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రైతులపై నీటి తీరువా రూపంలో పిడుగు పడనుంది. వారి నుంచి భా రీస్థాయిలో నీటి తీరువా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు 1996 సంవత్సరంలో నిర్ణయించినవని, ఈ నేపథ్యంలో వాటిని రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు సీసీఎల్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. పెంపుదల ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండంకెల వృద్ధి సాధనలో భాగంగా మద్యం ఆదాయంతో పాటు నీటి తీరువా ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నీటి తీరువా ద్వారా రూ.86.08 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.631.56 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించారు. ధరలను రెట్టింపు చేయడంతో పాటు వసూలు పరిధిని పెంచడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1996లో చంద్రబా బు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నీటి తీరువాను పెంచారు. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే పెంపునకు రంగం సిద్ధమైందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో రైతులు నీటి తీరువా కింద ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దా నిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కు తగ్గారు.ప్రాజెక్టుల కింద రైతులకు సాగునీటిని ఇస్తున్నందున అందుకయ్యే నిర్వహణ వ్యయం మొత్తాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉందని సాగునీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా వసూలు చేస్తున్నారు. ఒకటవ కేటగిరీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఎకరానికి ఇంత అని వసూలు చేస్తున్నారు. రెండో కేటగి రీలో ఇతర ప్రభుత్వ ఇరిగేషన్ వనరుల కింద ఐదు నెలలు ఆపైన నీటి సరఫరా చేసే భూముల నుంచి వసూలు చేస్తున్నారు. -
పిడుగు కాటు
♦ పిడుగుపడి నలుగురు మృతి ♦ మృతుల్లో దంపతులు ♦ రైతు కుటుంబాల్లో అంతులేని విషాదం ♦ సహాయ కార్యక్రమాలకు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బూడి, కలెక్టర్ యువరాజ్ వారి బతుకులపై ప్రకృతి కన్నెర్ర చేసింది...అనుకోకుండా వాన కురుస్తుండటంతో తలదాచుకునేందుకు చెట్టుకిందకు వెళ్లిన వారిని పిడుగు పొట్టనపెట్టుకుంది. ఒకేసారి నలుగురిని బలితీసుకున్న ఈ సంఘటన కోటపాడు మండంల పిడ్రంగిని విషాదంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో దంపతులు కన్నుమూయగా మరో ఇద్దరు కూలీలు విగతజీవులయ్యారు. పొలానికి వెళ్లిన వారు శవాలుగా మారడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. కూలినాలి చేసుకునే బతుకుల్లో పిడుగు పెనుకల్లోలం నింపింది ఆధారం కోల్పోయిన కుటుంబాలు కూలిపనికి వెళ్లిన తమ ఇంటి యజమానులు సాయంత్రం వస్తారని ఎదురుచూసిన కుటుంబసభ్యులకు మరణ వార్త తీవ్ర విషాదంలో ముంచింది. జాగారపు సన్నిబాబు, జాగారపు ఈశ్వరరావులు వరుసకు అన్నదమ్ములు. రోజూ కూలిపని చేసుకుంటూ కుంటుంబాలను పోషించుకుంటున్నారు. ఆకస్మికంగా వీరి మృతితో ఆయా కుటుంబాలు ఆధారం లేకుండా పోయింది. సన్నిబాబుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఈశ్వరరావుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తెలకుపెళ్లిలుఅయిపోయాయి. కె.కోటపాడు : ఒకే రోజు పిడుగుపాటుకు నలుగురు మృతితో మండలంలోని పిండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది. ఆయా రైతు, రైతుకూలీ కుటుంబాల్లో అంతులేని వేదన మిగిలింది. చోడిపంట నూర్పిడికి శుక్రవారం పొలానికి వెళ్లిన సింగంపల్లి అప్పారావు(53), కళావతి(38) దంపతులతోపాటు కూలీపనికి వచ్చిన గ్రామానికి చెందిన జాగారపు సన్నిబాబు(49), జాగారపు ఈశ్వరరావు(48)లు మధ్యాహ్నం వరకు పంటను నూర్పిడి చేశారు. భారీ వర్షంతో నలుగురూ సమీపంలోని చెట్టుకిందకు చేరారు. దానిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు మృతిచెందారన్న వార్తతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి బోరున విలపించారు. రోదనలతో గ్రామం శోకసంద్రమైంది. చావులోనూ వీడని బంధం: వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రైతు సింగంపల్లి అప్పారావు, అతని భార్య కళావతిలు చావులోనూ వీడలేదు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవల పెళ్లి చేశారు. కొడుకు రాజేష్‌ను ఇంజినీర్‌ను చేయాలని ఆశపడ్డారు. ఆరుగాలం కష్టపడేవారు. వచ్చిన ఆదాయంతో కొడుకును ఇంజినీరింగ్ చదివించారు. నేడోరేపో ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మృత్యువు పిడుగు రూపంలో ఆ దంపతులను కబళించింది. కొడుకు రాజేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తనకు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పారావుకు 80 ఏళ్లు పైబడిన వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుకోడలు మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే ముత్యాలనాయుడు వాకబు నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారని తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కర్నూలు నుంచి ఫోన్లో ఆయా కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయం అందించాలని ఇన్చార్జి తహాశీల్దార్ నాగేశ్వరరావును ఆదేశించారు. ఆర్డీఓ పద్మావతి సంఘటన స్థలానికి వచ్చారు. ఇదిలావుండగా జిల్లా కలెక్టర్ యువరాజ్, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఫోన్ ద్వారా సంఘటపై ఆరాతీసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు మృతదేహాలను పిండ్రంగి గ్రామ పొలిమేరకు శుక్రవారం రాత్రి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
విడపనగల్లు(అనంతపురం): అనంతపురం జిల్లా విడపనగల్లు మండలం గడేకల్లు గ్రామంలో శనివారం సాయంత్రం ఓ యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. గ్రామానికిచెందిన మేకల శ్రీనివాసులు(24) తన పొలంలో శనివారం సాయంత్రం పనులు చేసుకుంటుండగా సమీపంలో పిడుగు పడింది. షాక్‌కు గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య శకుంతల, ఏడాది కూతురు ఉన్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం జిల్లాలోని సదాశివపేట మండలం వేటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చేతకూరి దానయ్య ఇంటిపై శుక్రవారం కురుస్తున్న వర్షాలకు పిడుగుపడింది. దీంతో దానయ్య(60) అతని అల్లుడు మల్లేషం(35), మనవడు అనిల్(10) లు మృతిచెందారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. (సదాశివపేట) -
పిడుగు పడి మహిళ మృతి
మక్కువ : మండలంలోని వెంకట భైరిపురం గ్రామానికి చెందిన వెలమల పార్వతి (40) అనే మహిళ శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. స్థానిక వీఆర్వో శ్రీనివాసరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి గ్రామ సమీపంలో ఉన్న గుడేవలస కొండకు కట్టెల కోసం వెళ్లింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈదురుగాలు, మెరుపులు, ఉరుములు రావడంతో ఆమె కొండ సమీపంలోని పాక వద్దకు వెళ్లింది. అందులోనే చెల్లూరు రవిప్రసాద్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతలో వర్షం పడడంతో పాటు పెద్ద శబ్దం వచ్చి పాకపై పిడుగు పడటంతో పార్వతీ అక్కడికక్కడే మృతి చెందగా, రవి ప్రసాద్ గాయాలపాలయ్యాడు. రవిప్రసాద్‌ను మక్కువ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన పార్వతికి భర్త తవిటినాయుడు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పార్వతి పిడుగు పాటుకు మృతి చెందడంతో వెంకటభైరిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
బయ్యారం, న్యూస్‌లైన్: పిడుగు ముగ్గురిని బలితీసుకుంది. బయ్యారం మండలంలోని తులారం ప్రాజెక్టు అలుగుల వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని గౌరారం పంచాయతీ వినోభానగర్‌కు చెందిన జవ్వాది వెంకటమ్మ(50), ఆమె కుమార్తె శ్రీలత(21)తో పాటు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగలివారిపేటకు చెందిన బబ్లు(12)(వెంకటమ్మ మరో కుమార్తె కొడుకు) బట్టలు ఉతికేందుకు తులారం ప్రాజెక్టు వద్దకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో పిడుగులతో భారీ వర్షం కురిసింది. చీకటి పడుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా బబ్లు తులారం ప్రాజెక్టు వద్ద నీటిలో తేలుతూ కనిపించాడు. ఉతికేందుకు తీసుకెళ్లిన దుస్తులు చిందరవందగా పడిపోయి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన వారు నీటిలో చూడగా వెంకటమ్మ, ఆమె కుమార్తె శ్రీలత మృతదేహాలు లభించాయి. వారు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన సమయంలో అక్కడ పిడుగు పడిందని, పిడుగు పాటుకే వారు మృతి చెందారని స్థానికులు అంటున్నారు.