విడపనగల్లు(అనంతపురం): అనంతపురం జిల్లా విడపనగల్లు మండలం గడేకల్లు గ్రామంలో శనివారం సాయంత్రం ఓ యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. గ్రామానికిచెందిన మేకల శ్రీనివాసులు(24) తన పొలంలో శనివారం సాయంత్రం పనులు చేసుకుంటుండగా సమీపంలో పిడుగు పడింది. షాక్‌కు గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య శకుంతల, ఏడాది కూతురు ఉన్నారు.