మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం జిల్లాలోని సదాశివపేట మండలం వేటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చేతకూరి దానయ్య ఇంటిపై శుక్రవారం కురుస్తున్న వర్షాలకు పిడుగుపడింది. దీంతో దానయ్య(60) అతని అల్లుడు మల్లేషం(35), మనవడు అనిల్(10) లు మృతిచెందారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
(సదాశివపేట)