భద్రాచలం: ఆదివారం ఖమ్మం జిల్లా భద్రాచలంకు భక్తులు పోటెత్తుతారని భావించిన అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రంజాన్ సెలవు కావడంతో భక్తులు భద్రాద్రికి లక్షల్లో తరలివచ్చారు. ఆదివారం సైతం ఇదే విధంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులంతా సిద్ధమయ్యారు. ఇద్దరు మంత్రులు జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు మాణిక్‌రాజ్, యోగితారాణా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండగా.. కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ షానవాజ్ ఖాసీం ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.