సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూపులకు మోక్షం లభించింది. సబ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త నొటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రద్దుపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ట్రాన్స్‌కో సబ్ ఇంజనీర్ల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం త్వరలోనే సబ్ ఇంజనీర్ల నియామకాలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment