ఏం చర్యలు తీసుకుంటున్నారు..!
► వాటర్ బాటిల్స్ అధిక ధరపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బస్‌స్టేషన్లు తదితర చోట్ల వాటర్ బాటిళ్లను గరిష్ట అమ్మకపు ధర (ఎంఆర్‌పీ) కన్నా అధికంగా విక్రయిస్తున్నా తూనికలు, కొలతల శాఖ పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పెండ్యాల సతీష్‌కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.
ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిం చాలంటూ పౌర సరఫ రాలశాఖ ముఖ్య కార్యదర్శి, తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్‌లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.