త్వరలోనే టీఆర్ఎస్ చేరుతా: రాజేశ్వరరావు
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మీడియాకు తెలిపారు. కేసీఆర్ అభ్యర్థన మేరకే నిజామాబాద్ మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎస్ మద్దతిచ్చానని రాజేశ్వరరావు అన్నారు.
కేసీఆర్ పకడ్బంధీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. టీఆర్ఎస్ లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని రాజేశ్వరరావు తెలిపారు. నిజమాబాద్ లో ఎన్నికలో మేయర్ ఎంపికకు రాజేశ్వరరావు అనుకూలంగా ఓటు వేశారు.