క్యాట్‌ను ఆశ్రయించిన అనితారాజేంద్ర
సాక్షి, హైదరాబాద్: తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకో వాలంటూ చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తనతో పాటు సర్వీసులో చేరిన వాణీ ప్రసాద్‌తో సమానంగా తనను ఐఏఎస్ పోస్టుకు తీసుకోలేదని పేర్కొన్నారు. 1997లో ఏలేరు కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పు పట్టిన రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ 1999లో తన సర్వీసును పునరుద్ధరిస్తూ ఏపీఏటీ ఆదేశాలు జారీచేసిందన్నారు. అనంతరం అన్ని అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించిం దని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలాన్ని సీనియారిటీగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయాలని ఆమె క్యాట్‌ను కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూపీఎస్సీకి కౌంటర్ దాఖలు చేయాలని బుధవారం నోటీసులు జారీ చేసింది.