
'త్వరలో పేదలకు ఉచిత గృహ నిర్మాణ పథకం'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 750 కోట్ల ఆర్థిక సాయం కోరుతున్నామని తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం తొలివిడతగా రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా స్నానఘట్టాలను 15 కు పెంచుతున్నామన్నారు. ఇందిరమ్మ గృహాల్లో అవకతవకలపై సీఐడీ నివేదిక వచ్చిన తరువాతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు ఉచిత గృహ నిర్మాణ పథకం త్వరలో మొదలు పెడతామన్నారు. పట్టణాల్లో రెండు అంతస్తులు, గ్రామాల్లో ప్రతి వ్యక్తికి సొంత ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు.