
యువతి చెవిలోనుంచి పురుగులు!
సంగెం : యువతి చెవిలో నుంచి పురుగులు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన సుల్తాన్ ఎల్లమ్మ, కొమురయ్య దంపతుల చిన్న కూతురు రజిత(20)కు కొంత కాలంగా ఎడమ చెవిలో నొప్పి వస్తోంది. తల్లిదండ్రులు ఆమెను గత ఏడాది డిసెంబర్ 27న సంగెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె చెవి నుంచి పురుగులను తీశారు.
అదే రోజున వరంగల్‌లో ఒకసారి, 30న ఇంకోసారి కూడా పురుగులను తీశారు. అయితే రెండ్రోజుల నుంచి చెవినొప్పిగా ఉందని రజిత చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20కి పైగా పురుగులను బయటకు తీసినా అవి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతున్నారు.