టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్
హన్మకొండ : తెలుగుదేశం శాసన సభా పక్షా న్ని (టీడీఎల్‌పీ) టీఆర్‌ఎస్‌లో విలీనం చేయ డం అప్రజాస్వామికమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్ అన్నారు. టీడీఎల్‌పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హన్మకొండలోని కాళో జీ కూడలిలో టీడీపీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసేలా ఉందని పేర్కొన్నారు.
టీడీపీఎల్‌పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ అమోదం తెలిపి స్పీకర్ టీఆర్‌ఎస్ పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక మచ్చలా మిగిలిపోతుందన్నారు. తమ తప్పులను ఎత్తి చూపకుండా శాసన సభలో ప్రతి పక్షాలు లేకుండా చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు సరైన సమయంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ధర్నాలో తాళ్లపల్లి జైపాల్, శ్రీరాముల సురేష్, ఎం.డీ .రహీం, గొల్లపల్లి ఈశ్వరాచారి, కుసుమ శ్యాంసుందర్, గంటా దేవేందర్‌రెడ్డి, మార్గం సారంగం, మార్క విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
టీడీఎల్‌పీ విలీనం అప్రజాస్వామికం
Published Sat, Mar 12 2016 1:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement