కరీంనగర్ జిల్లా వేములవాడలో అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
వేములవాడ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా వేములవాడలో అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారినుంచి 32 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతోపాటు ద్విచక్రవాహనం, ఐదువేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూర్ మం.పాతదాంరాజ్ పల్లికి చెందిన పల్లెపు రాజేష్ (25), నిజామాబాద్ జిల్లా పెర్కిట్ కు చెందిన పల్లెపు రాజు (25), సారంగాపూర్ మం.గణేష్ పల్లికి చెందిన సూర సాయిలు కలిసి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 19 దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ జోయెల్ డేవిస్ తెలిపారు.
వీరితో పాటూ.. ఒంటరిగా వెళ్ళే మహిళలపై అఘాహిత్యాలకు పాల్పడి బంగారం దోచుకెళ్ళే జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గనవేని మహేష్ (23) ను అరెస్ట్ చేసి 1.72 గ్రా.ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.