మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు  | International Recognition To Mission Kakatiya Scheme | Sakshi
Sakshi News home page

మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు 

Published Thu, Jul 25 2019 1:36 AM | Last Updated on Thu, Jul 25 2019 4:37 AM

International Recognition To Mission Kakatiya Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్‌ వరల్డ్‌ ఇరిగేషన్‌ ఫోరం (డబ్ల్యూఐఎఫ్‌3) ప్రతినిధి విజయ్‌. కె.లబ్సెత్వార్‌ నుంచి ఇరిగేషన్‌ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ సంస్థ (ఐసీఐడీ) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. మిషన్‌ కాకతీయపై సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, చిన్న నీటివనరుల ఎస్‌ఈ కె.శ్యాంసుందర్‌లు రాసిన సాంకేతిక పత్రం ఈ సదస్సులో సమర్పించేందుకు ఆమోదం పొందింది.

అలాగే ఆన్‌ ఆఫ్‌ పద్ధతి ద్వారా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో నీటి నిర్వహణ అభివృద్ధి గురించి, ఎస్సారెస్పీలో నీటి సమర్థ వినియోగం గురించి రాసిన సాంకేతిక పత్రాలు కూడా సదస్సు ఆమోదం పొందాయి. ఈ మేరకు ఈ మూడు అంశాలపై ఇరిగేషన్‌ అధికారులు సదస్సుకు హాజరై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మూడు సాంకేతిక పత్రాలు రాసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్, అడ్మిన్‌ ఈఎన్‌సీ బి.నాగేందర్‌రావులు అభినందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement