చివ్వెంల: నకిలీ విదేశీ కరెన్సీ చెలామణి చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రశీదు నిందితుల వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన వల్దాస్ ఉపేందర్‌ను అదే పట్టణానికి చెందిన రంప శ్రీను, జాన్‌కూటి మోహన్‌కుమార్ వారం రోజుల క్రితం కలిశారు.తమ వద్ద బ్రెజిల్ రూ.వెయ్యి కరెన్సీ(మిల్‌క్రూసెడస్ల్)నోట్లు ఉన్నాయని, కావాలంటే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో కాఫీ డే హోటల్‌కి వచ్చి తీసుకోమ్మని తెలపండంతో ఉపేందర్‌కు అక్కడకు వెళ్లాడు. వీటి విలువ భారత దేశంలో ఒక్కనోట్‌కు రూ.24 వేలు వస్తాయని నమ్మబలికి ఆతని వద్ద నుంచి రూ.40వేలు ఇండియా కరెన్సీ తీసుకుని రూ.40బ్రెజిల్ నోట్లు ఇచ్చారు.
ఈక్రమంలో ఉపేందర్ హైదరాబాద్‌లోని కరెన్సీ ఎక్స్ఛేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. నోట్లను మార్చుకునే క్రమంలో అధికారులు ఈనోట్లు 2003 సంవత్సరంలోనే ఆదేశంలో రద్దు చేశారని తెలపడంతో చేసేది లేక ఇంటికి వచ్చి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు, కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ కె.నర్సింహారావు డీఎస్పీ ఆదేశాలతో సూర్యాపేట పట్టణానికి చెందిన శ్రీను, మోహన్‌కుమార్‌ను ఆదుపులోకి తీసుకొని విచారించగా పెద్ద రాకెట్ బయట పడింది. వీరికి నకిటి నోట్లు ఇచ్చేవారు ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట పట్టణంలోని ఎంఎస్‌ఆర్ హోటల్‌కు వస్తారని తెలపడంతో రూరల్ సీఐ వి.నర్సింహారెడ్డి, ఎస్‌ఐ కె.నర్సింహారావు అక్కడకు వెళ్లి మాటు వేసి నకిలీ కరెన్సీ ముఠాను ఆదుపులోకి తీసుకున్నారు.
ముఠా సభ్యులు విజయవాడ, గుంటూరుకు చెందిన షేకవజీర్ అహ్మద్, హతిరాజ్ గురువయ్య, కలపల అజయ్‌కుమార్,కన్న మహేష్, మన్నవ బసంత్ బాబులుగా గుర్తించి వారి వద్ద నుంచి 596 బ్రెజిల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ భారత కరెన్సీలో రూ.కోటి 43 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలపారు. వీరిని విచారించగా తమకు చెన్నైకు చెందిన రమణ అనే వ్యక్తి నుంచి వస్తాయని వాటిని వివిధ ప్రాంతాలో తమ ఎజెంట్ల ద్వారా చెలామణి చేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా రూరల్‌సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ కె,నర్సింహరావు, ఐడీపార్టీ సిబ్బందిఎం.అంజయ్య, శ్రీనివాస్‌నాయుడు, రామనర్సయ్య, జాఫర్ ఆలీ, శివలను డీఎస్పీ అభినందించారు.
అంతర్‌రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
Published Tue, Mar 3 2015 12:28 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement