ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల రగడ | Irrigation department to make dispute | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల రగడ

Published Sun, Jun 28 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల రగడ

ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల రగడ

* ఆందోళన బాటలో జోన్ 6 ఉద్యోగులు
* సీనియారిటీని విస్మరించడంపై ఆందోళన
* జూలై 9 నుంచి ధర్నా చేస్తామని నోటీసు

 
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో పదోన్నతుల వివాదం రాజుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో విస్మరించిన పదోన్నతుల అంశాన్ని ఇప్పటికైనా పరిష్కరించాలని ఇరిగేషన్ విభాగంలోని జోన్-6 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 9 నుంచి ఆందోళన బాట పట్టాలని నిర్ణయిస్తూ, శని వారం ఈఎన్‌సీకి నోటీసు అందజేశారు. ఇరిగేషన్ శాఖలో జోన్-6 ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం 2004లో తెరమీదకు వచ్చింది. రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఉద్యోగులు పదోన్నతుల్లో అన్యాయాన్ని అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్యను అధ్యయనం చేసేం దుకు ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్, విజయ్‌కుమార్ కమిటీలను వేసింది.
 
 హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను జోన్ 6 కింద పరిగణించి పదోన్నతులు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ సిఫారసులు అమలు కాకపోవడంతో 2012లో ఇరిగేషన్ శాఖ జోన్-6 ఉద్యోగులు మరోమారు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని నియమించారు. సబ్‌కమిటీ కూడా తేల్చకపోవడంతో ఈ వ్యవహారం రగులుతూ వస్తోంది. ప్రస్తుతం ఇరిగేషన్ విభాగంలో అన్ని స్థాయుల్లోనూ ఇంజనీర్లకు పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదోన్నతుల జాబితాలో జోన్ 5 ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. తమకు మరోమారు అన్యాయం జరుగుతోందనే భావనతో ఆరో జోన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement