గ్రామీణులకు ఐటీ ఉపయోగపడాలి
మంత్రి కేటీఆర్‌తో గవర్నర్
రాజ్‌భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్
మొబైల్‌యాప్స్ ద్వారా పౌరసేవలు
ఈ-పంచాయతీలుగా 10 వేల గ్రామాలు
హైదరాబాద్: ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా గ్రామీణులకు ఉపయోగపడేలా ఐటీని అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మంగళవారం రాజ్‌భవన్ లో గవర్నర్‌కు మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకుని, లబ్ధి పొందేలా ఐటీ ఉం డాలని గవర్నర్ సూచించారు. 10 వేల గ్రామాలను ఈ-పంచాయతీలుగా అభివృద్ధి చేస్తున్నట్టు మం త్రి వివరించారు. ఇప్పటికే నల్సార్, ఐఎస్‌బీ, ఐఐ ఐటీ వంటి విద్యాసంస్థలను అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. అలాగే కొత్తగా ఐటీ పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చే 1,500 మంది ఔత్సాహికులను ప్రోత్సహించి, ఇంక్యుబేష న్ సెంటర్లో యూనిట్ల ఏర్పాటుకు అవకాశమిస్తామ న్నారు. అంతర్జాతీయ గేమింగ్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అక్టోబర్ 7న ప్రారంభమయ్యే మెట్రోపోలీస్ కార్యక్రమానికి వైఫై సౌకర్యం కల్పిం చనున్నట్టు మంత్రి తెలిపారు. మొబైల్‌యాప్స్‌తో పౌరసేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఆన్‌లైన్ బిజినెస్ కంపెనీలు (ఫ్లిప్‌కార్ట్ వంటి) సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భం గా ఇంజనీరింగ్ కాలేజీల విద్యాప్రమాణాల గురిం చి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్(టాస్క్)ను ఏర్పాటు చేసి నట్టు కేటీఆర్ వివరించారు. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడుల కోసం అమెరికా, జపాన్ వం టి దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. మీరు చెప్పిన ప్రయత్నాలన్నీ ఆచరణలో వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని గవర్నర్ అభిప్రాయపడినట్టు తెలి సింది. ఈ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తెలిశాయని నరసింహన్ సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌లో తీసుకుంటున్న చర్యలనూ గవర్నర్‌కు వివరించినట్టు భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా ఐటీలో ఏం జరుగుతుందో తెలపాలని గవర్నర్ మంత్రి కేటీఆర్‌ను కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు సమాచారం.