
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మంత్రి హరీశ్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఆయన రెండు సార్లు మంత్రి అయ్యేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment