యాంటీ క్లైమాక్స్‌.. విలోమ పరాకాష్ట | jaipal reddy comments on union budget | Sakshi
Sakshi News home page

యాంటీ క్లైమాక్స్‌.. విలోమ పరాకాష్ట

Published Fri, Feb 3 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

యాంటీ క్లైమాక్స్‌.. విలోమ పరాకాష్ట

యాంటీ క్లైమాక్స్‌.. విలోమ పరాకాష్ట

బడ్జెట్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా, నిస్పృహ పెంచేలా ఉందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో రైతులను ఎలాంటి ఊరట, దన్ను లేదని, కొత్త రైలు మార్గాలు లేవని, అసలు బడ్జెట్‌కు దశదిశ లేకుండాపోయిందని దుయ్యబట్టారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ యాంటీ క్లైమాక్స్‌లా, విలోమ పరాకాష్టలా ఉందని విమర్శించారు.

నోట్ల రద్దుతో 50 రోజులు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు తాజా బడ్జెట్‌తో తీవ్రంగా నిరాశ చెందారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గడంతో రూ. లక్ష కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వానికి తగ్గిందని.. అయినా ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. పార్టీల విరాళాల సంస్కరణ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement