ప్రత్యేక జిల్లా కోరుతూ బంద్కు పిలుపు
వరంగల్: జనగామ మండలాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు.
అఖిలపక్ష నాయకులు రోడ్లపై బైఠాయించి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. జనగామలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.