మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యమని పరితపించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ అన్నారు. స్థానిక న్యూటౌన్‌లో గల ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల గుప్పిట్లో నుంచి ఈ ప్రాంత నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను దక్కించుకోవడం కోసం ఆయన తపించిన తీరు మరువరానిదని అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో అధిపత్యం కోసం రాజకీయ పార్టీల నాయకుల్లో విభేదాలు వచ్చినప్పుడు వారందరిని సమన్వయ పరచి ఆందోళనలను కొనసాగించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో ఆయన లేకపోవడం ఎవరూ పూడ్చలేని లోటని అన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ఆయన గడిపిన సాధారణ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జయశంకర్ ఆశయాలను నెరవేర్చిననప్పుడే ఆయన త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణకు సార్థకత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ మహ్మద్ వాజిద్, నాయకులు ఎల్.జస్వంత్‌రెడ్డి, కెటీ నర్సింహారెడ్డి, మహ్మద్ సర్దార్, అశోక్, విజయకుమార్ యాదవ్, నర్పింహారెడ్డి, రమేశ్, శ్రీనివాస్, యూనుస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జయశంకర్ తపించారు
Published Thu, Aug 6 2015 4:37 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement