రైతు రుణాలను రీషెడ్యూల్ చేసేలా రిజర్వు బ్యాంకును ఒప్పించలేకపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. కొత్త రుణాలను ఇప్పించలేకపోతే రైతులంతా వడ్డీవ్యాపారుల చేతిలో బలవుతారని ఆయన తెలిపారు. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం వారికి రుణాలు ఇప్పించి విద్యుత్ కొరత లేకుండా చూడాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం నాయకత్వ వైఫల్యమేనని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ లోపాన్ని పార్టీ అధిష్టానం సరిచేస్తుందని చెప్పారు. పీసీసీ చీఫ్ మార్పు ఉండొచ్చని ఆయన పరోక్షంగా, సూచనప్రాయంగా అన్నారు.
అది ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే
Published Wed, Aug 6 2014 3:03 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement