
సమగ్ర కుటుంబ సర్వేతో వెయ్యి కోట్ల నష్టం
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే విధానాన్ని టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. దీని వల్ల దినసరి కూలీలకు, ఉత్పాదక రంగాలకు వెయ్యి కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుందని అన్నారు.
సర్వే రోజున కుటుంబ సభ్యులందరూ ఇంటివద్దే ఉండాలనే నిబంధన సరికాదని జీవన్ రెడ్డి చెప్పారు. కుటుంబంలో ఒక్కరు ఉండి అందరి వివరాలు చెప్పే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.