భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్ : నగరపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకుంటామని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేట నగరపంచాయతీ పాలకవర్గ అభినందనసభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని, తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇతర పార్టీలకు డిపాజిట్ గల్లంతవ్వడం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకమేనన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే శక్తి సామర్థ్యాలు ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ప్రజా సంక్షేమం కో సం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, విద్య, వైద్యరంగాల్లో అర్హులకు స్థానం, పేదలకు పింఛన్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. అచ్చంపేట ప్రజలు టీఆర్‌ఎస్‌పై ఉన్న వి శ్వాసంతో ఓట్లువేసి గెలిపించారని, కొత్త గా ఎన్నికైన కౌన్సిలర్లు రాజకీయాలకు పోకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.
మహాకూటమి మాయం : గువ్వల బాల్‌రాజ్
ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేకపోయాయని, మహాకూటమి ఎక్కడో మాయమై పోయిందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎద్దేవ చేశారు. టీఆర్‌ఎస్‌ను, తనను అబాసుపాలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకమై కుటీల రా జకీయాలు చేశాయని, అచ్చంపేట ప్ర జలు మహాకూటమికి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయని, ప్రజల తీర్పు మరింత బాధ్యత పెంచిందన్నారు.
ఘన సన్మానం
కొత్తగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్లను మం త్రి జూపల్లి కృష్ణారావుతోపాటు జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నా రాయణరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌లు ఘనంగా సన్మానించారు. కళాకారుడు సాయిచంద్ బృందం ఆటాపాట ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ పర్వతాలు, నాయకులు నర్సిం హ్మగౌడ్, మనోహర్, సీఎం రెడ్డి, రాంబాబునాయక్, అమీనొద్దీన్, వెంకట్‌రెడ్డి, గణే ష్, ఉస్సేన్, నీడ్స్‌బాబా, కటకం రఘు రాం తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
Published Wed, Mar 16 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement