JUPALLY Minister Krishnarao
-
బాబు కోసమే టీటీడీపీ ప్రజా పోరు
⇒ మంత్రి జూపల్లి ధ్వజం ⇒ ఉద్యమంలో ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు కోసం ప్రజా పోరు యాత్ర చేస్తున్నట్లుందని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నేతలు ఏనాడూ కలసి రాలేదని, నాటి యువత ఆత్మహత్యలకు చంద్రబాబే కారణ మని ఆరోపించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి జూపల్లి సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. డబ్బు సంచులు మోసే అలవాటున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరు లు ప్రజాపోరు పేరిట యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని జూపల్లి అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు డిజైన్ చేసేవారని, ప్రస్తుతం అధికారులు డిజైన్ చేస్తున్నారన్నా రు. చంద్రబాబుకు రేవంత్ గులాంగిరి చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి లగడపాటి రాజగోపాల్‌కు చెంచాగిరి చేస్తున్నారన్నారు. టీడీపీకి ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని, ప్రభు త్వంపై అనవసర విమర్శల తో నోరు పారేసుకుంటున్న రేవంత్ వంటి నేతల నోర్లను ఫినాయిల్‌తో కడగాలని జూపల్లి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గతంలో ఏ సంక్షేమ పథకం కంటే తక్కువో చెప్పాలని నిలదీశారు. బ్రోకర్లు, సీమాంధ్రకు చెంచాగిరి చేసే రేవంత్, వంశీచంద్ వంటి నేతలకు ప్రజా సమస్యలపై బహిరంగ చర్చలకు పిలిచే అర్హత లేదన్నారు. సీఎం అవుతానని బహిరంగంగా చెప్పుకుంటున్న రేవంత్... వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో గెలిస్తే అదే ఎక్కువని ఎమ్మెల్యే గువ్వల ఎద్దేవా చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి ఏమీ చేయని రేవంత్... రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించా రు. కేసీఆర్‌ను పదేపదే దొర అంటూ రేవంత్ సంబోధిస్తున్నారని... సుపరిపాలన అందిం చడంలో కేసీఆర్ నిజంగా దొరేనని వ్యాఖ్యా నించారు. రేవంత్‌కు చెప్పుల దండ వేసేందు కు దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
క్యాష్‌లెస్ ఆసరా!
- లబ్ధిదారులందరికీ ‘రూపే’ కార్డులిప్పించాలని - సెర్ప్ నిర్ణయం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఆసరా పథకాన్ని ‘క్యాష్‌లెస్’ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35.96 లక్షలమంది లబ్ధిదారులు ఉండటం, వీరికి ప్రతినెలా రూ.397 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేయాల్సి రావడంతో అధికారులు క్యాష్‌లెస్ ఆసరా దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్ పంపిణీకే నగదు కొరత ఏర్పడినందున, భవిష్యత్తులో నగదు (పింఛన్)పంపిణీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత నెల రోజులుగా పింఛన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ సరిపడా కొత్తనోట్లు లభించక మొత్తం సొమ్ములో రూ.130 కోట్లను సెర్ప్ సిబ్బంది నేటికీ పంపిణీ చేయలేకపోయారు. అధికారిక లెక్కల ప్రకారం వివిధ జిల్లాల్లో 11 కోట్ల మంది లబ్ధిదారులు తమకు అందాల్సిన అక్టోబర్ నెల పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆసరా లబ్ధిదారులకు రూపే కార్డులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.96 లక్షలమంది లబ్ధిదారుల్లో ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు కలిగిన 13.63 లక్షల మందికి ప్రతినెలా పింఛన్ సొమ్మును వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తోంది. మరో 17.81లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్ సొమ్మును అందజేస్తుండగా, ఇంకా గ్రామాల్లోని 4.52 లక్షలమందికి ఎటువంటి ఖాతాలు లేకపోవడంతో పంచాయతీ సిబ్బంది ద్వారా పింఛన్ సొమ్మును చేతికి అందజేస్తున్నారు. అరుుతే, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలున్న వారికీ డెబిట్ కార్డులు లేకపోవడంతో వారు కూడా నగదును తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు లేని లబ్ధిదారులకు సమీప బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణరుుంచారు. ఆ మేరకు మొత్తం ఆసరా లబ్ధిదారులందరికీ రూపే కార్డులు ఇప్పించి పింఛన్ సొమ్మును కూడా క్యాష్ లెస్ లావాదేవీల్లో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఇదే విధానం ఉపాధిహామీ కూలీలకు కూడా బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల ద్వారానే వేతన సొమ్మును చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ పథకం చెల్లింపులకు నగదు కొరత, క్యాష్‌లెస్ లావాదేవీల కోసం చేపట్టాల్సిన చర్యల గురించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల, పోస్టాఫీసుల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్షించనున్నట్లు తెలిసింది. -
1,524 గ్రామీణ రోడ్లు ధ్వంసం
370 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టండి... పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో జూపల్లి సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1,524 పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దాదాపు 1,700ల కి.మీ.మేర పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ రహదారుల స్థితిగతులపై ఆ విభాగ ఉన్నతాధికారులతో గురువారం సచివాల యంలో మంత్రి జూపల్లి సమీక్షించారు. కోతకు గురైన 530 రహదారులకు మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పాడైన అన్ని రోడ్లకు కలిపి తాత్కాలిక మరమ్మతులకు రూ.49.61 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.318.58 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లాల్లో 73 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. వీటి మరమ్మతుల కోసం రూ.2.89 కోట్లు అవసరమని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. నాలాల ఆక్రమణ, అనుమతులులేని నిర్మాణాలపై పదిరోజుల్లో గా నివేదికను సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను, జిల్లా డీపీవోను ఆదేశించారు. -
కొల్లాపూర్‌ను అగ్రస్థానంలో నిలుపుదాం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ రూరల్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే కొల్లాపూర్‌ను అగ్రస్థానంలో నిలపుదామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్లో రెండో విడత తెలంగాణ హరితహారంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మండలానికి 8 లక్షల చొప్పున నియోజకవర్గంలో 40లక్షల మొక్కలు నాటేందుకు కృషిచేయాలన్నారు. ఈ సంవత్సరం రెండో విడతలో జిల్లాలో 4.53 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, ఫారెస్ట్, పంచాయతీరాజ్ శాఖలంతా సమన్వయంతో కృషిచేసి అధిక మొత్తంలో మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలన్నారు. రేపటి నుంచే గుంతలు తీయడానికి సమాయత్తం కావాలని, మొక్కలు నాటే కార్యక్రమం గ్రామాలో్ల పూర్తిగా ఫీల్డ్ అసిస్టెంట్లే బాధ్యత వహించాలన్నారు. ఏ గ్రామానికి మొక్కలు అందకున్నా వెంటనే మొబైల్ ద్వారా అధికారులకు మెసేజ్ పెట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా బాధ్యతగా వ్యవహరించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారంలో వందశాతం మొక్కలు నాటిన గ్రామాలకు రూ.లక్ష, మండల స్థాయిలో ఎన్జీఓలు, కార్పొరేట్, ప్రభుత్వ, స్థానిక సంస్థలు మొక్కలు నాటి ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.2 లక్షల వరకు ప్రభుత్వం బహుమతులు ఇస్తుందన్నారు. సమావేశంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ రామ్మూర్తి, డీఎఫ్ఓ బాలస్వామి, డీపీఓ వెంకటేశ్వర్లు, వనపర్తి ఆర్డీఓ రామచందర్, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, లావణ్య, జెడ్పీటీసీలు హన్మంతునాయక్, బస్తీరాంనాయక్, రవి, వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
‘టెస్కో’ పాలకమండలి రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జీవో నెంబర్19ను జారీ చేశారు. రాష్ట్ర హస్తకళల అభివృధ్ధి సంస్థ ఎండీని టెస్కో పర్సన్ ఇన్చార్జిగా నియమించారు. 2018 మార్చి వరకు ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాలం ఉంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో.. రద్దు ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గత ఏడాది ఆగస్టులో షీలా బిడే కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్ 31 న ఆవిర్భవించిన తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది డెరైక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 16 మార్చి 2018 వరకు పదవీ కాలం ఉంది. కాగా, పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతమున్న పాలక మండలిని రద్దు చేసి.. నూతన పాలక మండలిని నియమించాలంటూ ప్రభుత్వంపై కొందరు డెరైక్టర్లు ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలకమండలి నియామకంపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నారు. అక్కడి నుంచి సమ్మతి రావడంతో తాజా ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట/ అచ్చంపేట రూరల్ : నగరపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకుంటామని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేట నగరపంచాయతీ పాలకవర్గ అభినందనసభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడుతున్నారని, తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇతర పార్టీలకు డిపాజిట్ గల్లంతవ్వడం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకమేనన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే శక్తి సామర్థ్యాలు ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం కో సం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, విద్య, వైద్యరంగాల్లో అర్హులకు స్థానం, పేదలకు పింఛన్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్పై ఉన్న వి శ్వాసంతో ఓట్లువేసి గెలిపించారని, కొత్త గా ఎన్నికైన కౌన్సిలర్లు రాజకీయాలకు పోకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. మహాకూటమి మాయం : గువ్వల బాల్‌రాజ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేకపోయాయని, మహాకూటమి ఎక్కడో మాయమై పోయిందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ను, తనను అబాసుపాలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకమై కుటీల రా జకీయాలు చేశాయని, అచ్చంపేట ప్ర జలు మహాకూటమికి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయని, ప్రజల తీర్పు మరింత బాధ్యత పెంచిందన్నారు. ఘన సన్మానం కొత్తగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్లను మం త్రి జూపల్లి కృష్ణారావుతోపాటు జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నా రాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌లు ఘనంగా సన్మానించారు. కళాకారుడు సాయిచంద్ బృందం ఆటాపాట ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ పర్వతాలు, నాయకులు నర్సిం హ్మగౌడ్, మనోహర్, సీఎం రెడ్డి, రాంబాబునాయక్, అమీనొద్దీన్, వెంకట్‌రెడ్డి, గణే ష్, ఉస్సేన్, నీడ్స్బాబా, కటకం రఘు రాం తదితరులు పాల్గొన్నారు.