బాబు కోసమే టీటీడీపీ ప్రజా పోరు | Jupally Krishnarao comments on Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు కోసమే టీటీడీపీ ప్రజా పోరు

Published Tue, Feb 14 2017 2:00 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబు కోసమే టీటీడీపీ ప్రజా పోరు - Sakshi

బాబు కోసమే టీటీడీపీ ప్రజా పోరు

మంత్రి జూపల్లి ధ్వజం
ఉద్యమంలో ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు కోసం ప్రజా పోరు యాత్ర చేస్తున్నట్లుందని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నేతలు ఏనాడూ కలసి రాలేదని, నాటి యువత ఆత్మహత్యలకు చంద్రబాబే కారణ మని ఆరోపించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి జూపల్లి సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. డబ్బు సంచులు మోసే అలవాటున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరు లు ప్రజాపోరు పేరిట యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని జూపల్లి అన్నారు.

కాంగ్రెస్, టీడీపీల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు డిజైన్‌ చేసేవారని, ప్రస్తుతం అధికారులు డిజైన్‌ చేస్తున్నారన్నా రు. చంద్రబాబుకు రేవంత్‌ గులాంగిరి చేస్తుంటే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి లగడపాటి రాజగోపాల్‌కు చెంచాగిరి చేస్తున్నారన్నారు. టీడీపీకి ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని, ప్రభు త్వంపై అనవసర విమర్శల తో నోరు పారేసుకుంటున్న రేవంత్‌ వంటి నేతల నోర్లను ఫినాయిల్‌తో కడగాలని జూపల్లి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గతంలో ఏ సంక్షేమ పథకం కంటే తక్కువో చెప్పాలని నిలదీశారు.

బ్రోకర్లు, సీమాంధ్రకు చెంచాగిరి చేసే రేవంత్, వంశీచంద్‌ వంటి నేతలకు ప్రజా సమస్యలపై బహిరంగ చర్చలకు పిలిచే అర్హత లేదన్నారు. సీఎం అవుతానని బహిరంగంగా చెప్పుకుంటున్న రేవంత్‌... వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో గెలిస్తే అదే ఎక్కువని ఎమ్మెల్యే గువ్వల ఎద్దేవా చేశారు. కొడంగల్‌ నియోజకవర్గానికి ఏమీ చేయని రేవంత్‌... రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించా రు. కేసీఆర్‌ను పదేపదే దొర అంటూ రేవంత్‌ సంబోధిస్తున్నారని... సుపరిపాలన అందిం చడంలో కేసీఆర్‌ నిజంగా దొరేనని వ్యాఖ్యా నించారు. రేవంత్‌కు చెప్పుల దండ వేసేందు కు దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement