రాజకీయాలా.. వ్యాపారాలా? | K. Chandrasekhar Rao Ultimatum | Sakshi
Sakshi News home page

రాజకీయాలా.. వ్యాపారాలా?

Published Sat, Jun 24 2017 1:23 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

రాజకీయాలా.. వ్యాపారాలా? - Sakshi

రాజకీయాలా.. వ్యాపారాలా?

ఏది కావాలో తేల్చుకోవాలని పార్టీలోని పైరవీకారులకు సీఎం అల్టిమేటం
► తరచూ ‘పనుల’ కోసం వస్తున్న నేతలకు మందలింపు
► కొందరు ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకూ ససేమిరా


సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు పదేపదే సాగిస్తున్న పైరవీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు! రాజకీ యాలు కావాలో లేక వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు! ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో, ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు నేతల పైరవీల విషయంలో పచ్చజెండా ఊపిన సీఎం కేసీఆర్‌...రానురానూ వారి వ్యవహా రం శ్రుతి మించడంతో సీరియస్‌గానే స్పందించారని తెలిసింది. ఇటీవల తన వద్దకు పనుల కోసం వచ్చిన కొందరు నాయకులకు సీఎం ఝలక్‌ ఇచ్చారని సమాచారం.

మూడేళ్లుగా కొందరు పైరవీల్లోనే...
తమ ప్రభుత్వంలో రాజకీయ అవినీతిని రూపుమాపామని సీఎం కేసీఆర్‌ గత మూడే ళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో కొందరు నిత్యం పైరవీల్లో మునిగి ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొందరు నాయకులు తమ వ్యాపారాల కోసం, తమ వర్గం వారి కోసం నిత్యం ఏదో ఒక పనిని సీఎం దగ్గరకు తీసుకువెళుతున్నారని ప్రచా రం జరుగుతోంది. వివిధ శాఖల్లో మంత్రుల స్థాయిలో కుదరని ‘పనుల’ను సదరు నేతలు సందర్భం చిక్కినప్పుడల్లా సీఎం వద్దకు సిఫారసులు తీసుకుపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని చెబు తున్నారు.

ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీకి ఝలక్‌...
పార్టీ ఎంపీ ఒకరు సీఎంను కలిసే ప్రతి సందర్భంలోనూ బదిలీల ఫైళ్లు పట్టుకు వెళ్లేవారని, మొదట్లో సదరు ఎంపీ పనుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం... ఆ తర్వాత అనుమానం వచ్చి సదరు బదిలీల సిఫారసులను పరిశీలిం చారని తెలిసింది. ఆ ఎంపీ బదిలీల సిఫా రసులన్నీ ఒకే కులానికి చెంది ఉండడాన్ని గమనించి ఆ తర్వాత నుంచి ఆ ఎంపీని పక్కనపెట్టారని చెబుతున్నారు. అలాగే గత మూడేళ్లుగా విద్యా రంగ పైరవీలు సాగి స్తున్న ఓ ఎమ్మెల్సీ ఇటీవల మరోసారి అదే పనిపై సీఎం వద్దకు వెళ్లారని, ఈ సమయంలోనే ‘నీకు రాజకీయాలు కావాలా లేక విద్యా వ్యాపారం కావాలా?’ తేల్చు కోవాలని ముఖ్యమంత్రి తీవ్రంగానే చెప్పారని వినికిడి.

పైరవీ నేతలకు నో అపాయింట్‌మెంట్‌...
కొందరు ఎమ్మెల్యేలు సైతం పైరవీ లు చేస్తుండగా సదరు ఎమ్మెల్యేలకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మొదట్లో నిత్యం సీఎం అధికారిక నివాసంలో తచ్చాడిన ఓ ఎమ్మెల్యేను కూడా పూర్తిగా పక్కన పెట్టారు. చివరకు తన అపాయింట్‌మెంట్‌ లేకుండా ప్రగతి భవన్‌కు ఎవరూ రావొ ద్దని, నేతలంతా ఉండాల్సింది నియోజక వర్గాల్లో తప్ప తన చుట్టూ కాదని సీఎం చెప్పారని సమాచారం. దీంతో పైరవీల ఫైళ్లతో తిరిగే నేతలకు చెక్‌ పెట్టినట్టయ్యిం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement